హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని 15 ఏళ్ళ ప్రేమ అనంతరం హిందీ-క్రిష్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. ఇరు కుటుంబాల నడుమ అంగరంగ వైభవంగా కీర్తి సురేష్ గోవా వేదికగా ప్రియుడు ఆంటోని చేత మూడుముళ్లు వేయించుకుని ఏడడుగులు నడిచింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉంది, పెద్దల అంగీకారంతో వివాహమాడింది.. ఇంకేంటి అంతా సింపుల్ గా చక్కగా జరిగిపోయింది అనుకున్నారు అంతా.
కానీ కీర్తి సురేష్ తన లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ని రివీల్ చేసింది. 15 ఏళ్లుగా ఆంటోని తో ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ ఒకొనొక సందర్భంలో లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుందట. తాము ఖచ్చితంగా లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని కీర్తి సురేష్, ఆంటోని అనుకున్నారట. ఇంత గ్రాండ్ గా తన పెళ్లి జరుగుతుంది అని ఊహించను కూడా లేదట.
మరి కీర్తి సురేష్ హిందూ, ఆంటోని క్రిష్టియన్ కావడంతో ఇరు కుటుంబాల వారు అంగీకరించరు అనుకుని కీర్తి సురేష్-ఆంటోని జంట లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనుకున్నారేమో, కానీ ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో కీర్తి సురేష్ లవ్ స్టోరీ సుఖంతమైంది అనేగా దీనర్ధం.
తమ పెళ్లి అలా గ్రాండ్ గా జరుగుతుంది అని ఊహించలేదు కాబట్టే తాళి కట్టే సమయంలో ఆంటోని కన్నీళ్లు పెట్టుకుంటే, ఆంటోని ని చూసి తాను కూడా ఎమోషనల్ అయినట్లుగా కీర్తి సురేష్ ఈ సందర్భంగా వెల్లడించడం గమనార్హం.




ఎన్టీఆర్ హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ 
Loading..