Advertisementt

అక్క‌ని గిఫ్ట్ ల‌తో ముంచ్చేసే త‌మ్ముడు

Thu 29th Jan 2026 09:05 AM
ram charan  అక్క‌ని గిఫ్ట్ ల‌తో ముంచ్చేసే త‌మ్ముడు
Ram Charan memorable gift to his sister Susmitha అక్క‌ని గిఫ్ట్ ల‌తో ముంచ్చేసే త‌మ్ముడు
Advertisement
Ads by CJ

రామ్ చ‌ర‌ణ్ నేడు ఓ గ్లోబ‌ల్ స్టార్ గా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తండ్రిని మించిన త‌న‌యుడిగా ఎదుగుతున్నాడు. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని విజ‌యాలు అందుకుని న‌టుడిగా  గొప్ప శిఖ‌రాలు అధిరోహిం చాల‌ని ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ప‌రంగా చ‌ర‌ణ్ ఇంకా గొప్ప స్థానానికి చేరుకుంటాడ‌ని మెగా ఫ్యామిలీ స‌హా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అక్క‌చెల్లిళ్ల‌తోనూ చ‌ర‌ణ్ అంతే స‌ర‌దాగా ఉంటాడు.

తాజాగా చ‌ర‌ణ్-సుస్మిత బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న‌ది బ‌య‌ట‌కొచ్చింది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. ఇద్దిరిది ఆదర్శవంతమైన అన్నాచెల్లెళ్ల బంధం. చరణ్ కంటే సుస్మిత వయసులో పెద్దవారైనప్పటికీ, చరణ్ ఆమెను ఎంతో గౌరవిస్తారు. సుస్మిత మాత్రం చరణ్‌ని ఎప్పుడూ తన చిన్న తమ్ముడిలాగే భావిస్తారు. చరణ్ గ్లోబల్ స్టార్ అయినప్పటికీ, ఇంట్లో మాత్రం చాలా సాదాసీదాగా, సరదాగా ఉంటారని ఆమె చెబుతుంటారు.

అలాగే అంద‌రి తోబుట్టువుల లాగే చ‌ర‌ణ్ -సుస్మిత కూడా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారట. చిన్నతనంలో ఇద్దరూ బొమ్మల కోసం, ఆటల కోసం గొడవ పడేవారు. కానీ చరణ్ మాత్చం చాలా సెన్సిటివ్. అని మెగా ఫ్యామిలీలో ఏ చిన్న పండుగ జరిగినా ? పుట్టిన రోజు వేడుకలు ఉన్నా సుస్మిత దగ్గరుండి అన్ని చూసు కుంటారుట‌. చరణ్ తన అక్క చేసే వంటలను, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ స్పెషల్ వంటకాలను బాగా ఇష్టపడతారు. అలాగే సుస్మిత‌ కి చిన్న‌ప్ప‌టి నుంచి బ‌హుమ‌తులు ఇవ్వ‌డం చ‌ర‌ణ్‌కు అల‌వాటు అట‌. ఎప్పుడూ ఏదో ఒక బ‌ముమ‌తి ఇస్తూనే ఉంటాడుట‌.

Ram Charan memorable gift to his sister Susmitha:

Ram Charan gift to his sister Susmitha

Tags:   RAM CHARAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ