ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇటీవల రాజకీయాలతో పాటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. సుజీత్ `ఓజీ`లో గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టారు. ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ నాందేడ్ (మహారాష్ట్ర)లో పర్యటించి అక్కడ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా సిక్కు రూపంలో అతడు ఇచ్చిన ఎంట్రీ వ్వావ్ అనిపించింది. ఆయన అదే లుక్ తో తిరగుప్రయాణమయ్యారు. పవన్ తో పాటు, ఆయన సతీమణి అన్నా లెజినోవా కొణిదెల కూడా ఈ పర్యటనలో ఉండటం విశేషం.
పవర్‌స్టార్ కొత్త లుక్ చూడగానే సింగ్ ఈజ్ కింగ్, సింగ్ ఈజ్ బ్లింగ్! అంటూ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయితే పవన్ ఈ కొత్త గెటప్‌లో మారడానికి కారణం ఉంది. సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేగ్ బహదూర్ 350వ షాహిదీ సమాగమం (బలిదాన స్మారక ఉత్సవం)లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నాందేడ్ వెళ్లారు. అక్కడ సాంప్రదాయం ప్రకారం.. తలకు సంప్రదాయ సిక్కు తలపాగా ధరించి కనిపించారు. ఈ పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి `తఖ్త్ సచ్ ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్` గురుద్వారాను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, పవిత్ర చాదర్ సమర్పించారు.
అనంతరం గురుద్వారా కమిటీ ఆయనను ఘనంగా సత్కరించి, సిక్కుల పవిత్ర ఆయుధమైన `కిర్పాన్`ను బహుకరించింది.ఈ సోమవారం ఉదయం అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.




రాజేంద్ర ప్రసాద్ - మురళి మోహన్‌లకు పద్మశ్రీ
Loading..