Advertisementt

ఇది కదా రియాలిటీ

Sun 25th Jan 2026 07:42 PM
amardeep  ఇది కదా రియాలిటీ
Amar about Bigg Boss ఇది కదా రియాలిటీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ విన్నర్స్ ఏదో సాధించేసాం, ఇకపై తమకు వెండితెర అవకాశాలు వచ్చేస్తాయని కలలు కంటూ ట్రోఫీ తో బయటికొస్తారు. బిగ్ బాస్ హౌస్ లో తమ వ్యక్తిత్వాన్ని ఇష్టపడి ఓట్లు వేసే అభిమానులు తమను వెండితెరపై కూడా సపోర్ట్ చేస్తారనుకుంటారు. అలాంటి వారిలో సీజన్ 2 విన్నర్ కౌశల్, మరో సీజన్ విన్నర్ సన్నీ, టాప్ 3 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్, పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఇలాంటి కలలే కన్నారు.

కానీ కౌశల్ దగ్గర నుంచి పల్లవి ప్రశాంత్ వరకు వారికి బిగ్ బాస్ ముందు ఎలా ఉందొ బిగ్ బాస్ తర్వాత అలానే ఉంది తప్ప కొత్తగా ఒరిగింది లేదు. సయ్యద్ సోహెల్ అయితే తన సినిమాని చూడమని నెత్తినోరు కొట్టుకున్నాడు. బిగ్ బాస్ లో వారిపై ఉన్న ప్రేమ బయటికొచ్చాక అభిమానులు చూపించడం లేదు. అదే విషయం సుమతి శతకం తో హీరోగా ఇంటర్ డ్యూస్ అవుతున్న బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ చెబుతున్న మాట.

బిగ్ బాస్ తో వచ్చిన అభిమానం సినిమాల్లో పని చెయ్యదు. బిగ్ బాస్ లో ఉన్న ప్రేమ బయటవుండదు. బిగ్ బాస్ అనేది కేవలం షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళ్ళడానికి తప్ప సినిమాల్లో అస్సలు ఉపయోగపడదు. బిగ్ బాస్ ని నమ్ముకుంటే సినిమాలకు ఉపయోగం లేదు. బిగ్ బాస్ లో ఆదరించారని సినిమాలకు రారు. సినిమాల్లో బిగ్ బాస్ ఆడియన్స్ సపోర్ట్ చెయ్యరు ఇదే రియాలిటీ అంటూ అమర్ దీప్ చౌదరి సుమతి శతకం ప్రమోషన్స్ లో ఓపెన్ గా చెబుతున్న మాట.

మరి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ క్రేజ్ సినిమా ల్లోకి పనికొస్తుంది అనుకుంటున్నాడు, చూద్దాం అతని ప్రయాణం ఎలా ఉండబోతుందో అనేది. 

Amar about Bigg Boss:

AmarDeep abput Bigg Boss Craze

Tags:   AMARDEEP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ