యువ పొలిటికల్ లీడర్, రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మినిస్టర్ నారా లోకేష్ బర్త్ డే ర్రోజు శుక్రవారం జనవరి 23. ప్రస్తుతం ఆంధ్ర లో యువతకు రోల్ మోడల్ గా మారడమే కాదు, ఆంధ్ర ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు పెట్టుబడులను ఆకర్షించడానికి నిరంతరం కష్టపడుతున్న నారా లోకేష్ రీసెంట్ గానే దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచఅగ్రగామి వ్యాపారవేత్తలను మీటై ఏపీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపోజల్ పెట్టారు.
ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నారా లోకేష్ కి ప్రముఖ నటుడు, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్(తారక్) సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. Many happy returns of the day @naralokesh! Wishing you another incredible year ahead.. అంటూ ఎన్టీఆర్ లోకేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందులో ఆశ్చర్యమేముంది. సోషల్ మీడియా వేదికగా ఈ యువనేతకు పుటిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఎన్టీఆర్ ఒకరు అనుకోవచ్చు. కానీ తారక్ నారా లోకేష్ కి మేనమామ కొడుకు, నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరముగా ఉంటున్న వ్యక్తి. ఒకప్పుడు పార్టీ కోసం యాక్టీవ్ గా పని చేసిన వ్యక్తి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటున్న వ్యక్తి కావడంతో ఈ విషెస్ అంతగా హైలెట్ అయ్యాయి.




రాజాసాబ్ - మారుతి కి పెరుగుతున్న సపోర్ట్ 

Loading..