Advertisementt

ఫోన్ ట్యాపింగ్ కేసు-రేవంత్ రెడ్డి పై KTR ఫైర్

Fri 23rd Jan 2026 11:23 AM
ktr  ఫోన్ ట్యాపింగ్ కేసు-రేవంత్ రెడ్డి పై KTR ఫైర్
KTR Press Meet ఫోన్ ట్యాపింగ్ కేసు-రేవంత్ రెడ్డి పై KTR ఫైర్
Advertisement
Ads by CJ

ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ ఎమ్యెల్యే హరీష్ రావు ని విచారించిన SIT ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలిచింది. నిన్న గురువారం నోటీసులు ఇచ్చి ఈరోజు శుక్రవారం విచారణకు పిలవగా.. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో అని నిన్న సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి హరీష్ రావు, కేటీఆర్ లు కేసీఆర్ తో చర్చించి వచ్చారు. ఇక విచారణకు వెళ్ళేముందు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతుంది.

కేసీఆర్ సైనికులుగా ఉద్యమం నుంచే ఉద్భవించింది.

ఆనాడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో రాష్ట్రం కోసం సుదీర్ఘంగా కొట్లాట చేశాము.

రాష్ట్రం వచ్చింది , కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, నేను మంత్రి అయ్యాను.

10 యేండ్లలో రాష్ట్రం కోసం ఎంతో పనిచేశాము.

మేము ఎన్నడు టైం పాస్ రాజకీయాలు చెయ్యలేదు.

మా నాయకుడు కేసీఆర్ గొప్పతనం ఏంటి... అంటే ఇవ్వని వాగ్దానాలు నెరవేర్చిన నాయకుడు కేసీఆర్.

ఇవ్వాళ బాధ అనిపిస్తుంది.

విచారణలకు మేము భయపడం.

పిచ్చోడి చేతిలో రాయిలా ఈరోజు రాష్ట్రం ఉంది.

ఒక్కోరోజు ఒక్కో డ్రామా పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ఇచ్చిన హామీలు పక్కకు వెళ్ళిపోయాయి  

పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎటువంటి అక్రమ పనులు నేను చేయలేదు.

నా పైన రెండేళ్ల నుంచి వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. 

నేను డ్రగ్స్ తీసుకుంటాను అని.... నాకు హీరోయిన్లతో సంబంధం ఉందని వార్తలు రాయించారు.

నేను నా కుటుంబాన్ని బాధ పెట్టారు.

రెండేళ్ల నుంచి నా పరువుకు బాధ్యుడు ఎవడో సమాధానం చెప్పాలి.

ఇదే విషయాన్ని సిట్ విచారణలో నేను అడుగుతాను.

మా ఎమ్మెల్యేలను కొనేందుకు... రేవంత్ రెడ్డి అనే దొంగ 50 లక్షల రూపాయలతో దొరికాడు.

ఆ విషయం మాకేం తెలుస్తుంది.

రేవంత్ రెడ్డికి అన్ని దొంగ బుద్దులే ఉంటాయి.... ఆయన ముఖ్యమంత్రి కాగానే మా పైన ఇలాంటి దాష్టీకానికి పాలపడుతున్నాడు.

సింగరేణిలో అతి పెద్ద కుంభకోణం జరిగింది అని హరీష్ రావు బయట పెట్టాడు.

ఉదయం ఈ కుంభకోణం పై మాట్లాడగానే , సాయంత్రం లోపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చారు.

హరీష్ రావు సిట్ విచారణకు హాజరై... సిట్ అధికారులనే.... హరీష్ రావు ప్రశ్నలు అడిగారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు టివి సిరియల్లా నడిపిస్తున్నారు.

ఒక సినిమాలో బ్రహ్మానందం దొంగగా... ప్రతిసారీ దొరుకుతాడు.

అలానే రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసుకుంటు దొరికిపోతున్నాడు.

దండుపాళ్యం ముఠా అక్రమాలు బయట పెడుతున్నందుకే మాపైన ఇలాంటి కేసులు...విచారణలు.

నా వ్యక్తిత్వం హనానికి పాల్పడుతున్న .... కొందరి పోలీస్ అధికారులను...అధికారంలోకి రాగానే వదిలి పెట్టేది లేదు.

అర్జునుడి కన్ను పక్షి మీద ఉన్నట్లు..... మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పై పోరాడుతూనే ఉంటాం.. అంటూ కేటీఆర్ మిగతా విషయాలు విచారణ అనంతరం మాట్లాడతాను అన్నారు. 

KTR Press Meet :

KTR Satires On CM Revanth Reddy

Tags:   KTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ