రీసెంట్ గా సౌత్ ఫిలిం డెకాయిట్ షూటింగ్ పూర్తి చేసిన మృణాల్ ఠాకూర్ ఈమధ్యన ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంది. కారణం కోలీవుడ్ హీరో ధనుష్ తో మృణాల్ డేటింగ్ లో ఉండడమే కాదు వాలెంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14 న ధనుష్-మృణాల్ ఠాకూర్ లు వివాహం చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
మృణాల్ ఠాకూర్ టీమ్ ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేసినా ధనుష్-మృణాల్ పెళ్లి వార్తలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ తాజాగా వదిలిన ఫొటోస్ చూస్తే క్యూట్ అండ్ బ్రీజి అనాల్సిందే. అంత చక్కగా బ్యూటీఫుల్ గా కనిపించింది.
మోడ్రెన్ వేర్ ఫ్రాక్ లో మృణాల్ ఠాకూర్ చాలా క్యూట్ గా స్వీట్ గా కనిపించింది. మృణాల్ ఠాకూర్ స్మైల్ చూస్తే యూత్ పడిపోవాల్సిందే. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోను బిజీగా కనిపిస్తుంది. సౌత్ అండ్ నార్త్ ప్రాజెక్ట్స్ తో మృణాల్ ఫుల్ బిజీ గా కనబడుతుంది. అటు పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA 22 లోను మృణాల్ ఠాకూర్ నటిస్తుంది అనే న్యూస్ ఉంది.




అన్నయ్య సైతం అసంతృప్తిగానే ఉన్నారా

Loading..