సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంతో `వారణాసి` ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోందో తెలిసిందే. ఇండియాస్ మోస్టై అవెటెడ్ ప్రాజెక్ట్ గా `వారణాసి` కనిపిస్తోంది. ప్రత్యేకించి బాలీవుడ్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టాలీవుడ్ ని మించిన ఆసక్తి బాలీవుడ్ లో కనిపిస్తోంది. మరి ఇంత ప్రత్యేకత అక్కడ ఎందుకొచ్చిందంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
ప్రస్తుతం `వారణిసి` బాలీవుడ్ వర్గాల్లో అత్యధికంగా చర్చించబడుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. కేవలం ప్రచారం ద్వారా మాత్రమే కాకుండా బిజినెస్ కారణంగానూ `వారణాసి`పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా, సాంస్కృతిక మూలాలున్నదిగా, వాణిజ్యపరంగా హైలైట్ ప్రాజెక్ట్ గా బాలీవుడ్ భావిస్తోంది.
రాజమౌళి సినిమాల్లో ఉండే ఎమోషన్ కు బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అవుతారు. అంతేకాదు విజువల్ వండర్ గానూ సినిమాను మలిచే సామర్ధ్యం ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన శైలికి బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులున్నారు. మరో ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటి అంటే? ఇది ఒరిజినల్ కథ కావడం. బాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ లు, సీక్వెల్స్ కనిపిస్తుంటాయి. ఈ ట్రెండ్ బాలీవుడ్కి బాగా అలవాటు పడి బోర్ గానూ ఫీలవుతారు. రాజమౌళి అలాంటి సినిమాలకు దూరంగా ఉంటారు. తాను ఏ సినిమా తీసినా ఒరిజనల్ స్టోరీ ఉంటుందని నమ్ముతారు.
సరికొత్త కథతో రావడం అనేది సాహసోపేతమైన నిర్ణయంగా హిందీ ఫాలోవర్స్ భావిస్తున్నారు. ఇది రాజమౌళి సృజనాత్మక ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అలాగే మహేష్ ఇంత వరకూ పాన్ ఇండియా సినిమా తీయలేదు. కానీ అతడికి అప్పటికే బాలీవుడ్ లో అభిమానులున్నారు. వారంతా వారణాసి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గొప్ప క్రెడిబిలిటీ దక్కుతుంది. బాలీవుడ్ నటి ప్రియాకం చోప్రా సినిమాలో హీరోయిన్ గా నటించడం హిందీ ఆడియన్స్ కు కనెక్షన్ కి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా చెప్పొచ్చు.





పూజ హెగ్డే ని ఇబ్బంది పెట్టిన ఆ స్టార్ ఎవరో
Loading..