జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆతర్వాత నాగబాబు కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చి జబర్దస్త్ యాజమాన్యం పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడమే కాదు ఆతర్వాత జీ తెలుగులో అదిరింది షో చేసాడు. అది అంతగా పాపులర్ అవలేదు కానీ.. రోజా ని గెస్ట్ గా పిలిచి మరీ కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ చాలా షాప్స్ ఓపెన్ చేసి నానా హడావిడి చేసాడు.
ఆర్పీ పెట్టిన చేపల పులుసు షాప్ కారణంగా కూకట్ పల్లిలో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. తర్వాత మణికొండ, ఎస్.ఆర్ నగర్ ఇలా పలు చోట్ల బ్రాంచ్ లు ఓపెన్ చేసాడు. అబ్బో యూట్యూబ్ వీడియోస్ తో ఆర్పీ హల్ చల్ మాములుగా చెయ్యలేదు. బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేసాడు, జబర్దస్త్ గ్యాంగ్, రోజా, నాగబాబు షాప్స్ ఓపెన్ చేసాడు.
కానీ 2024 ఎలక్షన్స్ తర్వాత ఆర్పీ చేపల పులుసు మాట వినబడలేదు, రాజకీయాల్లో బిజీ అయ్యి జనసేన, టీడీపీ కోసం పని చేస్తూ రోజా నే అడ్డమైన మాటలు అన్న ఆర్పీ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసుని మూసేసాడు. ఆతర్వాత అది ఏమైందో తెలియదు.
తాజాగా ఆర్పీ ని ఓ యాంకర్ ఎందుకు నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు షాప్స్ మూసేసారు అని అడిగితె.. జీవితంలో ప్రయాణించే క్రమంలో, ఆ ఫుడ్ బిజినెస్ ఒక పార్ట్, అలానే పాలిటిక్స్ కూడా తన జీవితంలో ఒక భాగమని చెప్పాడు, రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చేపల పులసు బిజినెస్ నుంచి తప్పుకున్నట్లుగా ఆర్పీ చెప్పుకొచ్చాడు.
ఇక తన రాజకీయ భవిష్యత్‌పై మాట్లాడుతూ.. తన పదవి ఇస్తారనే ప్రచారం ఉందని, ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకునేందుకు తాను రెడీ అని చెప్పాడు. తన స్థాయి, అర్హత బట్టి ఏదైనా పదవి ఇస్తే.. బాధ్యతతో అవినీతిరహితంగా పని చేస్తానని, టీడీపీ తరుపున నిజాయతీగా పనిచేస్తానని ఆర్పీ ఆశాభావం వ్యక్తం చేసాడు.





స్వరమాంత్రికుడు బుద్ధి చెబుతాడా
Loading..