గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లో మీను గా వెంకటేష్ కి గర్ల్ ఫ్రెండ్ నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆ చిత్రంతో రూ.300 కోట్ల క్లబ్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ సమానంగా ఆకట్టుకున్నారు. ఆ సంక్రాంతికి అంత పెద్ద హిట్ కొట్టిన మీనాక్షి మళ్లీ ఈ సంక్రాంతికి మరో బిగ్ హిట్ లో భాగమైంది.
అదే నవీన్ పోలిశెట్టి తో కలిసి నటించిన అనగనగా ఒక రాజు తో ఈఏడాది సంక్రాంతికి హిట్ కొట్టి సంక్రాంతి హీరోయిన్ గా లక్కీ బ్యూటీగా మారిపొయింది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది అనగనగ ఒక రోజు చిత్రం ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. అన్ని ఏరియాల్లో అనగనగ ఒకరాజు బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీ, ఈ ఏడాది సంక్రాంతికి అనగనగ ఒక రాజు మూవీ హిట్స్ తో మీనాక్షి సంక్రాంతి కి లక్కీ హీరోయిన్ గా మారింది అంటూ మాట్లాడుకుంటున్నారు.





నారి నారి థియేటర్స్ లో నవ్వులే నవ్వులు 
Loading..