గ్లామర్ పరిశ్రమలో బాలనటీమణులకు వేధింపులు ఎదురవ్వడం నిత్యకృత్యంగా మారిన సంగతి తెలిసిందే. అంతగా పరిణతి చెందని మైనర్ల రక్షణ విషయంలో తెలుగు చిత్రసీమ లేదా భారతీయ చిత్రపరిశ్రమలో ఎలాంటి నియమనిబంధనలు, చట్టాలు ఉన్నాయో మెజారిటీ ప్రజలకు తెలీదు. కానీ ఇప్పుడు హాలీవుడ్ లో ఇటీవల కొన్ని కొత్త నియమాలను ప్రవేశ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రముఖ వెటరన్ నటి జోడీ ఫోస్టర్ కొన్ని వేధింపుల ప్రహసనంపై కొన్ని సంచలన విషయాలను బహిరంగంగా మాట్లాడటంతో ఇప్పుడు మరోసారి సెట్లో వేధింపుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాను తన 12ఏళ్ల వయసులో మొదటి సినిమా(టాక్సీ డ్రైవర్)తోనే ఆస్కార్ అవార్డ్ అందుకున్నానని, దానివల్ల చాలా వరకూ టీన్ వేధింపుల నుంచి బయటపడ్డానని అన్నారు. అధికారంతో విర్రవీగే మాన్ స్టార్ల వేటకు చిక్కకుండా కాపాడిందని కూడా జోడీ ఫాస్టర్ వెల్లడించారు. బాల నటీమణులపై లైంగిక వేధింపులు క్రూరమైన చర్య అని విరుచుకు పడ్డారు. ఈ రంగంలో మహిళను చూస్తున్న విధానంపై నటి జోడీ ఫైరయ్యారు. ఒకవేళ తనకు అధికారం లేకపోతే ఇతర టీనేజీ ఆర్టిస్టుల్లానే వేధింపులకు గురయ్యేదానిని అని అంగీకరించారు.
నటన క్రూరమైన వృత్తి.. తన స్వభావానికి సరిపోదని తెలిసినా, తప్పనిసరి పరిస్థితులు ఇక్కడకు తీసుకొచ్చాయని ఫోస్టర్ అన్నారు. బాలనటీమణులు, మైనర్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాగి రెడ్ కార్పెట్ పై ఊగిపోయే టీనేజర్ల విషయంలో జాగ్రత్త తప్పనిసరి అని జోడీ ఫోస్టర్ తల్లిదండ్రులకు సూచించారు. మహిళను కేవలం ఒక వస్తువుగా చూడటం ఆపాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. కెరీర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న జోడీ ఫోస్టర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.




వర ప్రసాద్ గారు కొట్టారు రూ.200 కోట్లు 
Loading..