ఏపీ మినిస్టర్ నారా లోకేష్ బ్యాట్ పట్టారు. మనగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్- 4 క్రికెట్ ఓపెనింగ్ సందర్భంగా బ్యాట్ పట్టుకున్న నారా లోకేష్ మరోసారి బ్యాట్ పట్టి క్రీడాకారులను పేక్షకులను ఉత్సాహపరిచారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం బోగి ఎస్టేట్స్ లో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్- 4 క్రికెట్ పోటీల్లో నిన్న శుక్రవారం నారా లోకేష్ పాల్గొన్నారు.
ఇరు జట్ల మద్యన టాస్ వేసిన నారా లోకేష్ కాసేపు బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడిన వీడియోస్ వైరల్ గా మారాయి. ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్ మరియు విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగగా నారా లోకేష్ టాస్ వేశారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది.
అంతకుముందే లోకేష్ బ్యాట్ తీసుకుని కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడి క్రికెటర్స్ ని ఉత్సాహపరిచారు. ఆతర్వాత లోకేష్ అందరితో కలిసి ఫొటోస్ దిగుతూ సందది చేసారు.




ముంబై రియల్ ఎస్టేట్లో విరుష్క హవా
Loading..