ఈ సంక్రాంతికి విడుదలై న సినిమాల్లో ప్రభాస్ ది రాజాసాబ్ కి తప్ప మన శంకరవరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి చిత్రాలకు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే సంక్రాంతి సీజన్ లో జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ అవుతాయి సినిమాలు, హెవీ కాంపిటీషన్ అయినా నష్టాలు రావు.
కానీ ఈ సంక్రాంతికి హిట్ అందులోను అన్ని సినిమాలకన్నా బెటర్ గా ఉన్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి కి కలెక్షన్స్ కనిపించడం లేదు. కారణం శర్వానంద్ ప్లాప్స్ లో ఉండడం ఒకటైతే.. మరో మెయిన్ రీజన్ మన శంకర వరప్రసాద్ గారు ని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవడం, సినిమా విడుదలకు ముందు క్రేజ్ లేకపోవడం శర్వా కు సమస్యగా మారింది.
చిరు-అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ కి క్రేజ్ ఎక్కువ కనిపించడం, ప్రమోషన్స్ పరంగా టాప్ లో ఉండడం అన్ని శర్వానంద్ కు బ్యాడ్ అయ్యాయి. శర్వానంద్ రాంగ్ టైం లో దిగడమే కాదు ప్రమోషన్స్ పరంగా వీక్ గా ఉండడము మైనస్ అయ్యింది. కాబట్టే నారి నారి నడుమ మురారి కి కలెక్షన్స్ రావడం లేదు.
శర్వానంద్ గనక సంక్రాంతిని వదిలేసి మరో వారం చూసుకున్నటైతే డెఫనెట్ గా నిర్మాత కు లాభాలొచ్చేవి. కానీ ఇప్పుడు హిట్ అనిపించుకుని కూడా కలెక్షన్స్ తెచ్చుకోలేకపోతుంది శర్వా సినిమా.




ట్రాక్ ఎక్కిన యంగ్ హీరోలు
Loading..