నిజం చెప్పాలంటే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో అస్సలు క్రేజ్ లేని సినిమా ఏది అంటే శర్వానంద్ నారి నారి నడుమ మురారి అనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉంటుందా అనే అనుమానాలు కలిగించింది. కారణం శర్వానంద్ సినిమాకి ప్రమోషన్స్ లేకపోవడం. రాజసాబ్, శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు, అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో దూసుకెళ్ళిపోతున్నాయి.
కానీ శర్వానంద్ నారి నారి నడుమ మురారి సందడి లేకపోవడంతో అసలు ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ సాంగ్స్ వదులుతూ, నిర్మాత, హీరోయిన్స్ ఇంటర్వూస్ ఇస్తూ ఎలాగో ఫ్రేమ్ లకి తెచ్చారు. సంక్రాంతి సినిమాల్లో ఎలాంటి హడావిడి లేకుండా చప్పగా కనిపించిన చిత్రం నారి నారి నడుమ మురారి మాత్రమే.
కానీ ఇప్పుడు నారి నారి నడుమ మురారి ట్రైలర్ తో ఒక్కసారిగా ఈ సినిమా సంక్రాంతి సినిమాల్లో క్రేజీగా మారిపొయింది. అవుట్ అండ్ ఎంటర్టైనెర్ గా ఈ సినిమా ఉండబోతుంది అనేది ట్రైలర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. సీనియర్ నరేష్, సత్య ల కామెడీ ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ గా నిలవబోతుంది అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
నారి నారి నడుమ మురారి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. మరి సంక్రాంతి బరిలో క్రేజీగా మారిన ఈ చిత్రం పై ఆడియన్స్ లో ట్రైలర్ తోనే హోప్స్ మొదలైపోయాయి.




అఖండ 2 ఓటీటీలో చూసి గోలెత్తిపోతున్నారు
Loading..