పటాస్ దగ్గర నుంచి వరస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి కి ఆ హీరో బ్రేక్ లు వేస్తాడు, ఈ హీరో బ్రేకులు వేస్తాడని చాలామంది ఎదురు చూస్తున్నారు(ఆయన సక్సెస్ చూసి ఓర్వలేనివాళ్ళు). కానీ ఎలాంటి హీరో తో అయినా హిట్ కొట్టి చూపిస్తాడు ఈ దర్శకుడు. ఎఫ్ 3 చాలామందికి నచ్చకపోయినా సంక్రాంతి సీజన్ కాబట్టి వర్కౌట్ అయ్యింది.
సినిమాతో సక్సెస్ సాధించడమే కాదు, టార్గెట్ పెట్టుకుని దానిని రీచ్ అయ్యేందుకు రాత్రి పగలు కష్టపడే అనిల్ రావిపూడి మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరు తో చేసిన మన శంకర వరప్రసాద్ గారు తో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఈ చిత్రం పై మంచి అంచనాలున్నప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు తో అనిల్ రావిపూడి కి ఖచ్చితంగా స్పీడు బ్రేకర్ తగులుతుంది. చిరు తో సినిమా హిట్ కాదు, అనిల్ ఏం చేసినా ఈసారి వర్కౌట్ అవ్వదు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
అందుకేనేమో అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు ఇంటర్వూస్ లో ప్రతి సినిమా విడుదల సమయంలో వీడు దొరుకుతాడు, ఈసారైనా దొరుకుతాడని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ నేను దొరకనుగా అంటూ మన శంకర వరప్రసాద్ పై చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తూ అనిల్ రావిపూడి ఈ చిత్రంలోనూ హిట్ కొడతానని ఛాలెంజ్ చేస్తున్నాడు. చూద్దాం మరికొన్ని గంటల్లో ఆ ముచ్చట తీరిపోతుంది.




వరప్రసాద్ ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ 
Loading..