అక్కినేని ప్రిన్స్ అఖిల్ లెనిన్ చిత్రం తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గా లెనిన్ ఫస్ట్ సింగిల్ విడుదల తో పాటుగా సమ్మర్ రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. అయితే లెనిన్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంటూ సైలెంట్ గా 70 శాతం షూటింగ్ ఫినిష్ చేసేసిన అఖిల్ తాజాగా విజయవాడలో సందడి చేసాడు.
లెనిన్ మూవీ షూటింగ్ కోసం విజయవాడ వెళ్లిన అఖిల్ అక్కడ అక్కినేని నాగేశ్వరరావు కాలం నాటి ఒక సీనియర్ అభిమాని ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ అభిమాని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అఖిల్, వారితో కాసేపు సమయం గడిపారు. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అఖిల్ గత ఏడాది తను ప్రేమించిన జైనబ్ ని పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అటు కెరీర్ ఇటు పర్సనల్ లైఫ్ లో అఖిల్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు.




రాజసాబ్ - రిజల్ట్ అప్పుడే డిసైడ్ చెయ్యకండి 
Loading..