సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వ్యాయామాలు చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఈ విషయంలో ఎంత మాత్రం అశ్రద్ద చేయరు. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా? రోజులో రెండు గంటలు కచ్చితంగా జిమ్ కు కెటాయిస్తారు. వాళ్లను స్పూర్తిగా తీసుకుని మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య స్లిమ్ లుక్ మారారు. ఫిట్ నెస్ విషయంలో చిరు కూడా నేను సైతం అంటూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఈ విషయంలో చిరంజీవికి నాగార్జున ఎంతో ఇనిస్పేరేషన్ గా నిలిచారు. నాగ్ స్లిమ్ లుక్ చూసే చిరు కూడా వెయిట్ లాస్ అయ్యారు. వింటేజ్ లుక్ లోకి నాలుగైదు నెలల కాలంలోనే ట్రాన్సపర్మేషన్ కాగలిగారు. ఇలా స్లిమ్ గా ఉండటం ఎంతో సౌకర్యవంతంగానూ ఉందని అభిప్రాయపడ్డారు. 70 ఏళ్ల వయసులో చిరంజీవి జిమ్ చేసి ఆశ్చర్యపరిచారు. మరి సీనియర్ హీరోల్లో మిగిలిన ఒక్క హీరో ఎవరు? అంటే నటసింహ బాలకృష్ణ.
ఇంత వరకూ బాలయ్య జిమ్ చేస్తున్నట్లు ఎక్కడా బయటకు రాలేదు. ఫిట్ నెస్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆహార నియమాలు ఎలా ఉంటాయి? వంటి డేటా ఎక్కడా లేదు. ఏ సినిమా పాత్ర కూడా బాలయ్య నుంచి స్లిమ్ లుక్ డిమాండ్ చేయలేదు. దీంతో బాలయ్య కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ అప్ కమింగ్ చిత్రాల కోసం సింహం కూడా జిమ్ అనే రింగ్ లోకి దిగాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మరి అందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో చూడాలి.




మారుతి అడ్రస్ చెప్పి పెద్ద తప్పే చేసాడు
Loading..