క్యారెక్టర్ ఆర్టిస్టు మధునందన్ సుపరిచితమే. `నిన్నే ఇష్టపడ్డాను`, `సై`, `ఇష్క్`, `గీతాంజలి` , `గుండెజారి గల్లంతయ్యిందే`, `రభస`, `లై`, `వినయ విధేయ రామ` లాంటి చిత్రాల్లో నటించాడు.`గుండెజారి గల్లంతయ్యిందే` సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు. హీరో ప్రెండ్ పాత్రల్లో హైలైట్ అయ్యాడు. ఎక్కువగా నితిన్ హీరోగా నటించిన సినిమాల్లో కనిపిస్తాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తుంటాయి.
అయితే మధు నందన్ మునుపటి కంటే వేగంగా సినిమాలు చేయలేదిప్పుడు. అవకాశం వస్తే నటించడం లేదంటే ఖాళీగా ఉన్నట్లే సన్నివేశం కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన `శంబాల`తో మంచి విజయం అందుకున్నాడు. ఈ సక్సెస్ తో నటుడిగా మళ్లీ బిజీ అవుతాననే కాన్పిడెంట్ గా ఉన్నాడు. అయితే మధునందన్ కెరీర్ లో చాలా అవకాశాలు కోల్పోయినట్లు తాజాగా అతడి మాటల్లో బయట పడింది.
తనకు రావాల్సిన అవకాశాలు తన పక్కనే ఉన్నవారు కాజేసారని ఆరోపించాడు. మాయ మాటలు చెప్పి ఆ సినిమాల్లో వారు నటించారన్నాడు. కానీ అలాంటి మాయ మాటలు గానీ, వెన్నుపోట్లు గానీ తనకు తెలియవన్నాడు. పరిశ్రమకు ఎంత నిజాయితీగా వచ్చాడో? అంతే నిజాయితీగా పని చేస్తానని అవకాశాల కోసం అడ్డదార్లు..దొడ్డిదార్లు ఎంచుకోన న్నాడు.
అలా అనుకుంటే ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి రిటైర్మెంట్ కూడా తీసుకునేవాడినన్నాడు. అలాగే కొన్ని అవకాశాలు తన చేజారా వదులుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. ఓ సినిమా కోసం అమెరికా వెళ్లి రెండు నెలల పాటు అక్కడే ఉండటంతో? తాను తిరిగి మళ్లీ ఐటీ ఉద్యోగానికి వెళ్లిపోయానని చాలా మంది దర్శక, నిర్మాతలు అనుకోవ డంతో? ఆ ఛాన్సులు వినియోగించుకోలేకపోయానన్నాడు.




రామ్ తో త్రివిక్రమ్ అక్కడికే పరిమితమా
Loading..