Advertisementt

హీరోయిన్ గుడ్ న్యూస్.. అదికాక మ‌రేంట‌బ్బా

Fri 09th Jan 2026 04:00 PM
avika gor  హీరోయిన్ గుడ్ న్యూస్.. అదికాక మ‌రేంట‌బ్బా
Avika Gor Good News హీరోయిన్ గుడ్ న్యూస్.. అదికాక మ‌రేంట‌బ్బా
Advertisement
Ads by CJ

హీరోయిన్ అవికాగోర్ గ‌ర్భం దాల్చిందంటూ నెట్టింట ఎద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. `కొత్త ప్రారంభం` అనే క్యాప్ష‌న్ ఇచ్చి ఓ పోస్ట్  వ‌ద‌ల‌డంతో?  నెటి జ‌నులంతా తల్లి కాబోతుందంటూ ప్ర‌చారం షురూ చేసారు. తాజాగా ఈ ప్ర‌చారంపై అవికాగోర్ స్పందించింది. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మంటూ కొట్టిపారేసింది. నేను త‌ల్లి కాబోతున్నాను అన్న వార్త‌లో ఎలాంటి నిజం లేదు. అవాస్త‌వాల‌ను ఎందుకు స‌ర్క్యులేట్ చేస్తున్నారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

అభిమానులు ఏ విష‌యంలోనైనా  చాలా త్వ‌ర‌గా ఓ అంచ‌నాకి వ‌చ్చేస్తున్నారు. అలాంటి ఆలోచ‌న చేయోద్దంటూ హిత‌వు ప‌లికారు.  కానీ ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఇచ్చింది. నిజంగానే ఓ శుభ‌వార్త ఉంద‌ని..త్వ‌ర‌లోనే  ఆ విష‌యం చెబుతాన‌ని తెలిపింది. దీంతో ఆ వార్త సినిమాకు సంబంధించిందై ఉంటుందా? లేక‌ మ‌రో కొత్త సంగ‌తి ఏదైనా చెబుతుందా? అంటూ  నెటిజ‌నులు విశ్లేష‌ణ‌లు మొద‌లు పెట్టారు.  

అవికాగోర్ ప్రియుడు మిలంద్ చాంద్వానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  మిలంద్ సినిమా రంగానికి చెందిన వ్య‌క్తి కాదు. బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు. మిలింద్  తో నాలుగేళ్ల పాటు అవికాగోర్ డేటింగ్ చేసింది.ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మిలంద్  పరిచయం అయ్యాడు. ఆరు నెలల పాటు స్నేహితులుగా కొన‌సాగారు. అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో డేటింగ్ మొద‌లు పెట్టారు.

ఆ స‌మ‌యంలో అవికాగోర్ మిలంద్ ని ఎంత‌గా ఇష్ట‌ప‌డింద‌న్న‌ది ఒక్క మాట‌తో బ‌య‌ట పెట్టింది. మిలింద్ మంచివాడ‌ని, మానసికంగా ఇద్ద‌రికి ఎప్పుడో పెళ్లైపో యింద‌ని వ్యాఖ్యానించింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం కూడా ఎక్కు వ‌గానే ఉంది. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణ‌యాలు తీసుకుంటున్నాన‌ని మిలంద్ తెలిపాడు.

Avika Gor Good News:

Avika Gor dismisses pregnancy rumours

Tags:   AVIKA GOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ