Advertisementt

స్పిరిట్ పోస్టర్ పై సందీప్ రియాక్షన్

Thu 08th Jan 2026 04:15 PM
prabhas  స్పిరిట్ పోస్టర్ పై సందీప్ రియాక్షన్
Prabhas interview with Sandeep Reddy Vanga స్పిరిట్ పోస్టర్ పై సందీప్ రియాక్షన్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ విడుదలవడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రాజసాబ్ మ్యానియా తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ప్రభాస్ కూడా రాజాసాబ్ ని తెగ ప్రమోట్ చేసారు. అందులో భాగంగా కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో చేసిన ఇంటర్వ్యూలో తానెందుకు రాజసాబ్ మూవీ చేసానో అనేది ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఓపెన్ అయ్యారు. 

తాను కెరీర్ ఆరంభం నుంచి యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువ చేశాను, అందుకే జోనర్ మార్చి డార్లింగ్ మూవీ చేస్తే అది అంతగా వర్కౌట్ అవ్వదు  అన్నారు. కానీ డార్లింగ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యాలి, అందుకే రాజసాబ్ ని ట్రై చేశాను. రాజసాబ్ ఎలా ఉంటుందో అనేది థియేటర్స్ లోనే చూడాలి. ఇది నాన్నమ్మ-మనవడి కథ. ఇందులో తాత విలన్. నేను రాజసాబ్ గా నటించాను అంటూ ప్రభాస్ రాజసాబ్ ముచ్చట్లు ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసారు. 

ఇక సందీప్ రెడ్డి అదే ఇంటర్వ్యూలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై రియాక్ట్ అయ్యారు. బాహుబలి లాంటి మూవీ చేసిన హీరోని ఎలా ప్రెజెంట్ చెయ్యాలా అని అలోచించి అలోచించి ఇప్పుడున్న లుక్ వదిలాము. స్పిరిట్ పోస్టర్ లో ప్రభాస్ చేతిలో ఉన్న గ్లాస్ గురించి బయట బాగా చర్చ జరిగింది. అది ఒక లీటర్ బాటిల్. ఆయన చేతిలో అది గ్లాస్ గానే కనిపిస్తుంది. 

స్పిరిట్ లో ఆ సీన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. పోస్టర్ లో ఎక్కువగా వైట్ మాత్రమే హైలైట్ అయింది. అందుకే ఆ బాటిల్ అందరి దృష్టిలో పడింది అంటూ సందీప్ వంగ స్పిరిట్ పోస్టర్ పై ఇంట్రెస్టింగ్ విషయాలను రాజసాబ్ ఇంటర్వ్యూలో షేర్ చేసారు. 

Prabhas interview with Sandeep Reddy Vanga:

The Raja Saab - King Size Interview 

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ