ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ రిలీజ్ కి సై అన్న కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి. అనగనగ ఒక రాజు ని సంక్రాంతి బరిలో ఏ ధైర్యంతో దించారో అనుకునేలోపు అదిరిపోయే ప్రమోషన్స్ తో అల్లరి స్టార్ట్ చేసాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి తో కలిసి నవీన్ పోలిశెట్టి డిఫరెంట్ వే లో అనగనగా ఒకరాజు ని ఆడియన్స్ లోకి తీసుకెళుతున్నాడు.
తాజాగా అనగనగ ఒకరాజు ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.. ట్రైలర్లోకి వెళితే యువరాజు లా నవీన్ పోలిశెట్టి కేరెక్టర్ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సరదా సంభాషణలు, మీనాక్షి తో లవ్ ట్రాక్, రావు రమేష్ పాత్ర అన్ని హిలేరియస్ గా ఆకట్టుకోవడం ఖాయం. పండగ బరిలో చిన్న సినిమా అనుకున్నవారికి ట్రైలర్ చూసాక అనగనగ ఒక రాజు పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అంటున్నారు.
నవీన్ పోలిశెట్టి లుక్స్ మాత్రం యూత్ కి బాగా నచ్చేసాయి. మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. మిగతా కేరెక్టర్స్ అన్ని కామెడీ గా కనెక్ట్ అవడం ఖాయం. ఇక సినిమాలోని భారీతనం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా కనిపిస్తున్నాయి.




అక్కడ రాజాసాబ్ కి ఎదురు లేదు.. 
Loading..