కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న కన్నడ హీరో యష్ ఆతర్వాత బిగ్ బ్రేక్ తీసుకుని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీ మార్చ్ లో విడుదల అంటూ చెప్పినట్టుగానే మార్చ్ 19 న సినిమా రిలీజ్ అని మరోసారి కన్ ఫర్మ్ చేస్తూ యష్ బర్త్ డే కి వదిలిన టీజర్ తో మేకర్స్ స్పష్టతనిచ్చారు. ఈరోజు జనవరి 8 న హీరో యష్ బర్త్ డే.
ఈ సందర్భంగా వదిలిన టీజర్ లో యాష్ లుక్స్ మరోసారి అభిమానులను సర్ ప్రైజ్ చేసాయి. టీజర్ ఆద్యంతం యష్ ఎలివేషన్, యాక్షన్ తో నింపేశారు. స్మశానవాటిక లో యష్ కారుతో ఇచ్చే ఎంట్రీ సీన్, బాంబ్ప్ కురిపిస్తూ హైలెట్ అయ్యింది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో సిగార్.. చేతిలో గన్‌తో యష్ పవర్ ఫుల్ గా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఈ టీజర్ చివరలో గన్‌తో ఫైర్ చేస్తూ డాడీ ఈజ్ హోమ్ అంటూ యష్ చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగ నచ్చేస్తుంది. భారీ సెటప్, భారీగా టీజర్ ని యష్ బర్త్ డే కి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసారు. అయితే ఈ టీజర్ లో ఎక్కడా హీరోయిన్స్ ని పరిచయం చెయ్యలేదు. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి ఇలా ఓ ఎనిమిదిమంది హీరోయిన్స్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారి లుక్స్ ని వరసగా మేకర్స్ వదిలిన విషయం తెలిసిందే.




శంకర వరప్రసాద్ అల్రెడీ హిట్-చిరు 
Loading..