Advertisementt

అఖండ 2 తాండవానికి ఓటీటీ కష్టాలు

Tue 06th Jan 2026 12:30 PM
akhanda 2  అఖండ 2 తాండవానికి ఓటీటీ కష్టాలు
Netflix Postpones Akhanda 2 OTT Release అఖండ 2 తాండవానికి ఓటీటీ కష్టాలు
Advertisement
Ads by CJ

అఖండ 2 తాండవం థియేటర్స్ లోనే కాదు ఓటీటీ పరంగాను కష్టాలను ఎదుర్కొంటుంది. డిసెంబర్ 5 న భారీ అంచనాలతో పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కావాల్సిన అఖండ 2 కి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దానితో ఓ వారం పాటు సినిమాను వాయిదా వెయ్యాల్సి వచ్చింది. అది అఖండ 2 ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది. 

ఇప్పుడు ఓటీటీలోనూ అఖండ తాండవానికి కష్టాలు తప్పడం లేదు అంటున్నారు. జనవరి 9 న అఖండ 2 స్ట్రీమింగ్ అంటూ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత కు అఖండ 2 స్ట్రీమింగ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే జనవరి 9 న ఓటీటీలోకి రావాల్సిన అఖండ 2 మరో వారం వాయిదా పడినట్లే అనే టాక్ మొదలైంది. 

దీనికి కారణాలు రకరకాలుగా వినబడుతున్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్లే అఖండ 2 ఓటీటీ వాయిదా అనే మాట వినబడుతుంది. కాదు కొన్ని టెక్నీకల్ రీజన్స్ వల్ల అఖండ 2 తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ ని వాయిదా వేశారు అంటున్నారు. ఈ ఓటీటీ వాయిదా పై ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. 

Netflix Postpones Akhanda 2 OTT Release:

Akhanda 2 OTT release date update

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ