Advertisementt

సంక్రాంతి హీరోయిన్స్ కి విషమ పరీక్ష

Tue 06th Jan 2026 09:18 AM
sankranti  సంక్రాంతి హీరోయిన్స్ కి విషమ పరీక్ష
Sankranthi Releases సంక్రాంతి హీరోయిన్స్ కి విషమ పరీక్ష
Advertisement
Ads by CJ

సంక్రాంతికి హీరోలే కాదు ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందుగా రాజసాబ్ హీరోయిన్స్ అసలు సిసలు పరీక్ష ఎదుర్కోబోతున్నారు. జనవరి 9 న రాబోతున్న రాజసాబ్ లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు ప్రభాస్ తో రొమాన్స్ చేస్తున్నారు. మరి నిధి పాప వీరమల్లు షాకు నుంచి తేరుకోవాలంటే రాజసాబ్ హిట్ అత్యంత అవసరం. 

మాళవిక మోహనన్ తెలుగులో జెండా పాతాలంటే రాజాసాబ్ హిట్ అవ్వాలి, ఇక రిద్ది కుమార్ ది అదే పరిస్థితి. అదే రోజు తమిళం నుంచి డబ్బింగ్ మూవీగా విడుదలవుతున్న జన నాయగన్ హీరోయిన్ పూజ హెగ్డే  గురించి చెప్పక్కర్లేదు. అమ్మడుకి ఈ చిత్రంతో హిట్ పడాలి, లేదంటే కష్టం. 

జనవరి 12 న మెగాస్టార్ చిరు తో మన శంకర్ వరప్రసాద్ లో నయనతార రొమాన్స్ చేస్తుంది. నయన్ కు ఈ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అయితే బాలయ్య NBK111 ప్రోజెక్ట్ కి క్రేజ్ పెరుగుతుంది. ఇక జనవరి 13 న రవితేజ భర్త మహాశయులు హీరోయిన్స్ ఆషిక రంగనాధన్, డింపుల్ హయ్యాతి ఇద్దరికి హిట్ ఖచ్చితంగా కావాల్సిందే. 

ఇక జనవరి 14 న నవీన్ పోలిశెట్టి తో కలిసి క్యూట్ గా రాబోతున్న మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కి సంక్రాంతికి వస్తున్నాం తో 300 కోట్ల క్లబుకులో చేరింది. సో ఈ ఏడాది సంక్రాంతికి కూడా హిట్ కొడతాను అని అమ్మడు హోప్స్ పెట్టుకుంది. అదే రోజు శర్వానంద్ నారి నారి నడుమ మురారి చిత్రం వస్తుంది. ఆ చిత్రంలో నటించిన భామలు సంయుక్త, సాక్షి ఇద్దరూ ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

అదే రోజు అంటే 1జనవరి 4 నే పరాశక్తి తో శ్రీలీల కోలీవుడ్ డెబ్యూ తో హిట్ కొట్టాలనుకుంటుంది. చూద్దాం ఈ హీరోయిన్స్ కి సంక్రాంతి కలిసొస్తుందో, లేదో అనేది. 

Sankranthi Releases :

Sankranti Box Office Fight

Tags:   SANKRANTI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ