మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ 2016లో విడుదలైంది. ఆ తర్వాత 2023లో రెండోసారి చైనాలో విడుదలైంది. ఓవరాల్ గా 2100 కోట్ల వసూళ్లను సాధించింది ఈ చిత్రం. రెండుసార్లు రెండు విభిన్న సమయాల్లో రిలీజైతేనే ఈ మొత్తం వసూలైంది. ప్రపంచవ్యప్త వసూళ్లలో 2000 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా `దంగల్` రికార్డ్ సృష్టించింది. ఆ రకంగా అమీర్ ఖాన్ మొదటి 2000 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం 2017లొ విడుదలై 1800కోట్లు వసూలు చేసింది. అంటే అమీర్ ఖాన్ 2023లో రికార్డ్ సాధించక ముందే భారతదేశంలో నంబర్ వన్ హీరో అయ్యాడు ప్రభాస్. అప్పటివరకూ 1800కోట్లు తేగలిగిన మొనగాడు భారతదేశంలో లేనే లేడు. ఒక్క ప్రభాస్ తప్ప.
అమీర్ ఖాన్ తర్వాత ప్రపంచవ్యాప్త వసూళ్లలో ది బెస్ట్ రికార్డ్ ప్రభాస్ పేరిట ఐదేళ్ల పాటు అలానే ఉంది. అయితే 2023లో షారూఖ్ నటించిన మూడు సినిమాలు పఠాన్, జవాన్, డంకీ విడుదలయ్యాయి. ఈ మూడు చిత్రాలు కలిపి 2000 కోట్లు వసూలు చేయగలిగాయి. అమీర్ ఖాన్ తర్వాత షారూఖ్ మాత్రమే 2000 కోట్లు ఒకే ఏడాదిలో వసూలు చేసిన హీరో. కానీ ప్రభాస్ ఒకే ఒక్క సినిమాతో 1800కోట్లు వసూలు చేసి ఆ ఇద్దరికీ సవాల్ విసిరాడు. ఏ రకంగా చూసినా ప్రభాస్ ఇప్పటికీ నంబర్ వన్ హీరో.
ఇప్పుడు ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో 2000 కోట్ల క్లబ్ అందుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. 2025లో అతడు నటించిన చావా, దురంధర్ విడుదలయ్యాయి. చావా 800కోట్లు, దురంధర్ 1200కోట్లు వసూలు చేయగా, మొత్తంగా 2000 కోట్ల క్లబ్ సాధ్యమైంది. ముగ్గురు ఖాన్ లు 2000 కోట్లు అందుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తే, బాహుబలి ప్రభాస్ రాజు ఒకే ఒక్క సినిమాతో ఇంచుమించు ఆ స్థాయికి చేరువగా ఉన్నాడు.
ప్రభాస్ నటించిన రాజా సాబ్ సంక్రాంతి బరిలో విడుదలకు వస్తోంది. తదుపరి సలార్ 2, కల్కి 2898 ఏడి సీక్వెల్ తో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.




బాలయ్య ను విజయ్ మ్యాచ్ చేశారా.. 
Loading..