బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో టాస్క్ ల విషయంలో, ఇంకా ఫుడ్ విషయంలో గొడవలు పడి పడి స్నేహితులే శత్రులుగా మారిపోయి, నాన్న-కూతురు బాండింగ్ బ్రేక్ అయ్యి, అన్న-చెల్లెలు బాండింగ్ బ్రేకవడం చూసాం. ఇమ్మాన్యుయేల్ తో రీతూ-తనూజలు స్నేహంగా ఉన్నా మూడో వారం నుంచి వారు విడిపోయారు. తనూజ కళ్యాణ్ వైపు, రీతూ డిమోన్ పవన్ వైపు, ఇమ్మాన్యుయేల్ సంజన వైపు వెళ్లిపోయారు.
హౌస్ లో ప్రతిసారి గొడవలు పడే కంటెస్టెంట్స్ ఆఖరికి హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా స్టార్ మా ఈవెంట్స్ లో గొడవలు పడుతూ టిఆర్పి ని పెంచే పనిలో ఉన్నారు. స్టార్ మా పరివార్ లో భరణి మట్లాడుతూ హౌస్ లో అందరూ నటిస్తారు, ఏదో ఒక సమయంలో అందరూ నటించేవారు, సుమన్ శెట్టి దగ్గర నాకు నటించే అవసరం రాలేదు అనగానే అందులో మీరు కూడా ఆన్నారు, మీరు కూడా నటించారా అని అవినాష్ అడగగానే భరణి ఫైర్ అయ్యాడు.
ఇక ఇమ్మాన్యుయేల్ రీతూ ఫ్రెండ్ షిప్ ప్రశ్న అడగ్గానే నాకు ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చెయ్యలేదు, అందుకే ఫ్రెండ్ షిప్ వదిలేసాను, ఇమ్ము కళ్యాణ్ వైపు వెళ్లిపోయాడనగానే రీతూ డిమోన్ వైపు వెళ్ళింది అన్నాడు ఇమ్మాన్యుయేల్. ఎప్పుడైనా ఇమ్ము గెలవాలనుకున్నావా రీతు అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్లు గెలవాలనుకున్నాను అంటూ రీతూ అన్న కామెంట్స్ చూసిన వారు వాళ్ళు హౌస్ లోనే కాదు బయట కూడా కొట్టుకు చస్తున్నారుగా అంటూ మాట్లాడుకుంటున్నారు.




టాక్సిక్ కి దురంధర్ 2 దెబ్బ
Loading..