పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు ఆపేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం గా ఏపీ ప్రజలకు సేవ చేస్తున్నారు, ఆయన రాజకీయాల్లో బిజీ కాకముందు ఒప్పుకున్న వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేస్తారు, ఆతర్వాత ఆయన రాజకీయాల కోసం సినిమాలకు విరామమం తీసుకుంటారనే ప్రచారం గట్టిగానే జరిగింది.
మరోపక్క దర్శకుడు సురేందర్ రెడ్డి తో పవన్ కమిట్ అయిన మూవీ ఆగిపోయింది అన్నారు. కానీ 2026 న్యూ ఇయర్ స్పెషల్ గా రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి కాంబో మూవీ మొదలు కాబోతుంది, ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్ చేసారు.
పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి తో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశి కూడా భాగమవుతున్నట్లుగా పిక్ తో ప్రకటించారు. సో పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు, ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ తో త్వరలోనే సెట్ పైకి వెళ్ళబోతున్నారు.




స్పిరిట్ లుక్ రాజాసాబ్ ని డిస్టర్బ్ చేసిందా
Loading..