స్టార్ హీరోలైనా, క్రేజీ హీరోయిలైనా, యంగ్ హీరోలైనా ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఆ క్రేజే వేరు. ఆ సినిమాపై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు తాజాగా ఇద్దరు సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి-విక్టరీ వెంకటేష్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వెంకీ పూర్తి స్థాయిలో ఈ చిత్రంలో కనిపించకపోయినా.. ఓ యాక్షన్ సీక్వెన్స్, ఓ సాంగ్ లో కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు మెగా-విక్టరీ సాంగ్ అంటూ కొన్నిరోజులుగా అందరిలో హైప్ క్రియేట్ చేస్తూ తాజాగా ఆ సాంగ్ ని వదిలారు మేకర్స్. చిరు-వెంకీ లుక్స్ విషయంలోనే కాదు స్టెప్స్ విషయంలోనూ పోటీపడ్డారు. భీమ్స్ మ్యూజిక్ సాంగ్ కి హైలెట్ అవ్వగా.. సాంగ్ లిరిక్స్ మాత్రం చాలా క్యాచీ గా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిరు-వెంకీ ఫ్రెండ్ షిప్ ఈ పాటలో హైలెట్ అయ్యింది.
చిరు-వెంకీ ఇద్దరూ పోటీపడి పబ్ లో వేసిన డాన్స్ కి మెగా ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మాస్ ఫీస్ట్, మెగా విక్టరీ సాంగ్ చూసి ఎంజాయ్ చెయ్యండి.




అచ్చతెలుగమ్మాయి ఈషా రెబ్బ
Loading..