కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసుడు రంగంలోకి దిగుతున్నాడా? డాడ్ సూచనలు, సలహాలతో సాలిడ్ గా ఎంట్రీ ఇస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. `భైరవం` సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. డాడ్ ప్రోత్సాహం పెద్దగా లేకపోయినా? స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నం మాత్రం ప్రశంసనీయం.
తాజాగా శంకర్ వారసుడిని కూడా తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే `ప్రేమిస్తే` సీక్వెల్ తో లాంచ్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అర్జిత్ శంకర్ ప్రాజెక్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలు అట్లీ శిష్యుడికి అప్పగించినట్లు సమాచారం. ఆ శిష్యుడు పేరు ఇంకా తెరపైకి రాలేదు గానీ, ఇతడు మురగదాస్ వద్ద కూడా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా పని చేసాడు.
ఆ అనుభవంతోనే శంకర్ నమ్మి తనయుడిని అతడి చేతుల్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి అర్జిత్ కోసం యువ సంచనలం ఎలాంటి కథ సిద్దం చేసాడో చూడాలి. అట్లీ డైరెక్టర్ కాక ముందు శంకర్ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే శిష్యుడు గురువు తనయుడిని లాంచ్ చేయడం ఇంట్రెస్టింగ్. పరిశ్రమలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. శంకర్ తలుచుకుంటే ఓ పెద్ద డైరెక్టర్ తో తనయుడిని లాంచ్ చేయించగలరు. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. తనయుడికి ప్రీ హ్యాండ్ ఇచ్చాడు.
నచ్చిన కథ, దర్శకుడిని ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించాడు. ఈనేపథ్యంలో అర్జిత్ శంకర్ అట్లీ, ముర గదాస్ శిష్యుడిని వడపోసి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాకెండ్ లో మాత్రం శంకర్ సూచనలు, సలహాలు తనయుడికి ఉండనే ఉంటాయి. ఎంతైన ఇది వారసత్వం విషయం కాబట్టి బయటకు ఓపెన్ కాకపోయినా? లోలోపల ఆ భావన ఉండనే ఉంటుంది.




కూల్ అండ్ స్వీట్ లుక్ లో శ్రీలీల
Loading..