నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో కొన్ని నెలలుగా అంతా గప్ చుప్ గా ఉంది. ఎలాంటి ప్రచారం తెరపైకి రాలేదు. సోషల్ మీడియా ప్రచారం తో విసుగెత్తిన నెటి జనులు కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో మీడియాలో కథనాలకు ఆస్కారం లేకుండా పోయింది. తాజాగా కొత్త ఏడాదిలో కి మరో మూడు రోజుల్లో అడుగు పెడుతోన్న నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్లీ కథనాలు ఊపందుకున్నాయి.
2026 జనవరి ముగింపులో చిత్రం ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు వినిపిస్తోంది. దీనికి సంబంధించి మోక్షజ్ఞ రిహార్సల్స్ కూడా ప్రారంభించాడుట. అన్ని రకాలుగా మోక్షజ్ఞ సంసిద్దంగా ఉన్నట్లు వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాల్సి ఉంది. ఇక స్టోరీ విషయానకి వస్తే `ఆదిత్య 369`కి కొనసాగింపు చిత్రమిదని తొలి నుంచి బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
`ఆదిత్య 999 మ్యాక్స్` టైటిల్ తో దీన్ని సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా కథను స్వయంగా బాలయ్య సిద్దం చేయడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. దర్శకత్వ బాధ్యతలు మాత్రం క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు తాజాగా కథనాలొస్తు న్నాయి. బాలయ్య రాసిని కథను క్రిష్ అన్ని రకాలుగా స్టడీ చేసి లాక్ చేసి పెట్టారు? అన్నది తాజా అప్ డేట్. మోక్షజ్ఞ పాత్రని ఎంతో స్టైలిష్ గా రాసినట్లు వినిపిస్తుంది.
ప్రస్తుతం క్రిష్ నటీనటులు, టెక్నిషీయన్ల ఎంపిక పనిలో ఉన్నట్లు సమాచారం. ఆ పనులు పూర్తికాగానే ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు కథనాలొ స్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో? బాలయ్య అండ్ కో అధికారికంగా ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు. ఇటీవలే బాలయ్య నటించిన `అఖండ శివతాండం` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.




గ్లామర్ గా పోటీపడుతున్న హీరోయిన్స్ 
Loading..