Advertisementt

రాజాసాబ్ - అభిమానులు ఇది సరిపోతుందా

Mon 29th Dec 2025 04:49 PM
the raja raab  రాజాసాబ్ - అభిమానులు ఇది సరిపోతుందా
The Raja Raab Trailer Review రాజాసాబ్ - అభిమానులు ఇది సరిపోతుందా
Advertisement
Ads by CJ

ద రాజాసాబ్ జనవరి 9 న విడుదల కాబోతుంది. ప్రభాస్ రీసెంట్ గానే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పైనే కాదు స్టేజ్ కింద కూడా అభిమానులు ముచ్చటపడేలా మాట్లాడారు, ప్రభాస్ అభిమానుల కరువు తీర్చేసారు. సినిమా విడుదలకు దగ్గర పడుతుంది. దర్శకుడు మారుతి సినిమాపై అంచనాలు పెంచేలా రిలీజ్ ట్రైలర్ ని వదిలారు. 

మొదటి ట్రైలర్ లో ప్రభాస్ కామెడీని చూపించిన మారుతీ ఈ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్, ప్రభాస్ ఎమోషన్స్, కథలోని అసలు విషయాన్ని రివీల్ చేసారు. అన్ని మర్చిపోయినా తాతను మర్చిపోలేదు అంటూ ప్రభాస్ నాన్నమ్మతో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూనే హర్రర్ కామెడీ తో అద్దరగొట్టేసారు. మారుతి టేకింగ్, విజువల్స్, హీరోయిన్స్ గ్లామర్ ఈ రిలీజ్ ట్రైలర్ హైలెట్ అయ్యాయి. 

ప్రభాస్ మొసలి తో ఫైట్ చూసాక అభిమానులు ఇది సరిపోతుందా లేదంటే ఇంకేమన్నా కావాలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. నిజమే ప్రభాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అన్ని రాజాసాబ్ లో హైలెట్ కాబోతున్నాయని ఈ ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక థమన్ BGM, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా వున్నాయి. జనవరి 9 న ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలు సిసలు సంక్రాంతి, కాసుకోండి మరి.  

The Raja Raab Trailer Review:

The Raja Raab Trailer released

Tags:   THE RAJA RAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ