ఈ ఏడాది మాత్రమే కాదు కొన్నేళ్లుగా సౌత్ నుంచి నార్త్ వరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న వచ్చే ఏడాది వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వబోతుంది. కెరీర్ లో జయాపజయాలు, షూటింగ్ లంటూ క్షణం తీరిక లేని రష్మిక ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఆమె నటిస్తున్న మైసా చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగానే రష్మిక సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. కారణం పెళ్లి చేసుకోవడమే. తన బాయ్ ఫ్రెండ్, హీరో విజయ్ దేవరకొండ తో కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న రష్మిక ఈ ఏడాది అక్టోబర్ లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది.
రీసెంట్ గానే శ్రీలంక కు వెళ్లి అక్కడ తన స్నేహితులతో గర్ల్స్ పార్టీ చేసుకున్న రష్మిక ఇప్పడు విజయ్ దేవరకొండ తో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చేక్కేసింది. ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పూర్తి కాగానే రష్మిక పెళ్లి పనులతో బిజీ అవుతుంది అని, షాపింగ్ అలాగే పెళ్లి కోసం రష్మిక సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారమైతే షురూ అయ్యింది.




వారణాసిలో మహేష్ ఐదు పాత్రల్లో
Loading..