బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ ని కళ్యాణ్ పడాల అనే కామనర్, ఆర్మీ మ్యాన్ చేజిక్కించుకున్నాడు. అగ్నిపరీక్షలో పోరాడి మొదటి కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి కొత్త వాళ్లతో ఎలా మెలగాలో తెలియక మొదటి మూడు వారాలు సైలెంట్ గా ఉన్న కళ్యాణ్ పడాల మూడో వారంలో ప్రియా తో కలిసి డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు.
నాలుగో వారంలో తనూజ తో కలిసి ఆడిన టాస్క్ లు ఆమె మోటివేషన్ తో కళ్యాణ్ ఆట తీరు మార్చుకున్నాడు. చివరివరకు తనూజ డైరెక్షన్ లో టాస్క్ లు ఆడాడు, అందరితో బావున్నాడు, గెలుపు తథ్యం అనుకున్న తనూజ కు గట్టిపోటీ ఇచ్చి మరీ చివరిలో కప్ గెలిచేసాడు. అయితే ఈ సీజన్ విన్నర్ గా తనూజ నే అనుకున్నారు.
తనుజనే ఆడియన్స్ మనసుల్లో ఉంది. కానీ ళ్యాణ్ పడాల కు చివరి రెండు వారాల్లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళు సపోర్ట్ చేస్తూ వారి అభిమానుల ఓట్లు కూడా కళ్యాణ్ పడాల కే పడేలా చేసారు. అదే చాలామంది అంటున్న మాట. రివ్యూయర్స్ వల్లే కళ్యాణ్ పడాల ఈరోజు విజేత అయ్యాడు. లేదంటే తనూజ నే ఈ సీజన్ విన్నర్ అని వాదిస్తున్నారు.
రెండు వారాల ముందు వరకు తనూజ ని పొగిడిన వారు చివరి రెండు వారాల్లో కళ్యాణ్ బంగారం, మనసులు గెలిచాడు అంటూ గీతూ రాయల్, ఆదిరెడ్డి లాంటి రివ్యూయర్స్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తేసారు. లేదంటే కళ్యాణ్ అనేవాడు ఎవరు.. విన్నర్ అయితే తనూజ, లేదంటే ఇమ్మాన్యుయేల్ కానీ ఈ కళ్యాణ్ కి అంత సినిమా లేదు.
కళ్యాణ్ ని వారు పొగడడం వల్లే తనూజ కు పడాల్సిన ఓట్లు కళ్యాణ్ కి పడ్డాయనే అభిప్రాయం తనుజను సపోర్ట్ చేసే వాళ్లే కాదు కామన్ ఆడియెన్సు, అలాగే కొంతమంది రివ్యూయర్స్ మాట్లాడడం గమనార్హం.




నయనతారను గట్టిగా వాడుతున్నారు. 
Loading..