నటుడు శివాజీ రీసెంట్ గా దండోరా ఈవెంట్ లో హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టయిల్ పై, ఆ గ్లామర్ డ్రెస్సులపై మహిళల ఇన్నర్ ఫీలింగ్స్ ఇవి అంటూ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి.
ఆ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. అమ్మాయిల అందం చీర లోనే ఉంది తప్ప, సామాన్లు కనపడే బట్టల్లో ఏమీ ఉండదు. అంతేకాకుండా ఆధునిక దుస్తులు వేసుకునే మహిళలను చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో చెబుతా అంటూ.. వారి ముందు నవ్వినా దరిద్రపు ముండా, ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి.. కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా అనుకుంటారు.. అంటూ శివాజీ మాట్లాడిన మాటలపై చాలామంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్స్ బట్టలపై ఓ నటుడు ఇలాంటి కామెంట్స్ చెయ్యడమేమిటి, బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని రోస్ట్ చేసినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా మహిళలపై, హీరోయిన్స్ పై కామెంట్స్ చేస్తే ఊరుకోము, శివాజీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కొంతమంది మహిళలు, నటీమణులు డిమాండ్ చేస్తున్నారు.
శివాజీ క్షమాపణ చెప్పేవరకు వారు ఊరుకునేలా లేరు, మరి ఈ కాంట్రవర్సీ ని శివాజీ ఎలా ఎదుర్కొంటాడో అనేది చూడాలి.




చిరు - వెంకీ కలిసాక ఉంటుంది సినిమా..
Loading..