మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర తో డిజప్పాయింట్ చేసినా మళ్లీ వెంటనే సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనే రీసెంట్ గా వదిలిన టీజర్ చూస్తే తెలుస్తుంది. కట్టుకున్న భార్య, ప్రియురాలు మద్యన నలిగిపోయే భర్తగా రవితేజ కేరెక్టర్ కామెడిగా ఉండబోతుంది.
తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ డీల్ పై అడిగిన ప్రశ్నకు క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. మీడియా వారు సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద సినిమాలు అందులోను రాజాసాబ్ లాంటి చిత్రానికన్నా ముందే మీ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ చేసింది మీరే, అదెలా సాధ్యమైంది అని అడిగితే..
దానికి మేకర్స్ మట్లాడుతూ మేము ఈ చిత్రాన్ని జీ 5 కి ఇచ్చాము, జీ వారికి షూటింగ్ కి ముందే మూడుసార్లు స్క్రిప్ట్ నేరేట్ చేస్తే... వాళ్ళు ఓకే చేశారు. పండక్కి ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైనర్ వర్కౌట్ అవుతుంది అనే వారు తీసుకున్నారు. షూటింగ్ కన్నా ముందే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ డీల్ క్లోజ్ చేసినట్టుగా మేకర్స్ వివరించారు.




BB 9 ఫైనల్ ఓటింగ్: విన్నర్, రన్నర్ ఫిక్స్
Loading..