Advertisementt

BB9: సంజన కు ఈ రేంజ్ ఎలివేషనా

Fri 19th Dec 2025 07:51 PM
sanjana  BB9: సంజన కు ఈ రేంజ్ ఎలివేషనా
Sanjana Bigg Boss Journey BB9: సంజన కు ఈ రేంజ్ ఎలివేషనా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి దొంగతనాలతో హౌస్ లో హైలెట్ అయిన సంజన టాప్ 5 కి వచ్చింది అంటే చాలామందికి నచ్చలేదు. ఆమె గేమ్ ఆడకుండా ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంది, ఇమ్ము తో కొడుకు బాండింగ్ పెట్టుకుని బయట పిఆర్ టీమ్ తో ఆమె టాప్ 5 కి వచ్చింది అంటూ చాలామంది సంజన పై కామెంట్లు పెడుతున్నారు.  

ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీ లు ప్లే చేస్తున్నారు. ఈరోజు నైట్ ఎపిసోడ్ లో సంజన జర్నీ రాబోతుంది. అయితే ఆ జర్నీ లో బిగ్ బాస్ సంజన కు ఇచ్చిన ఎలివేషన్ చూసి ఈమెకు ఇంత ఎలివేషన్ అవసరమా, స్ట్రాంగ్ ప్లేయర్స్ ని పంపేసి ఈమెను టాప్ 5 లో ఉంచడమే కరెక్ట్ కాదు అంటూ బయట మాట్లాడుతున్నారు. 

జర్నీ ప్లే చేస్తూ.. సంజన.. గేమ్ ఎలా నీ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలో నీకు తెలుసు, హౌస్ లో గుడ్డు దొంగతనంతో మొదలైన నీ చిలిపి ప్రయాణం టాప్ 5 చేరింది, నువ్వేం మాట్లాడినా, ఎవరు చెప్పినా వినకుండా అదే పాయింట్ పై స్ట్రాంగ్ గా నిలబడే మనస్తత్వం, బాండింగ్ తో అందరికి దగ్గరయ్యావ్, నువ్వు టాస్క్ ఆడినా, సంచాలక్ అయినా అంటూ సంజనకు బిగ్ బాస్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడం చాలామందికి రుచించడం లేదు. 

Sanjana Bigg Boss Journey:

Bigg Boss 9: Sanjana Bigg Boss Journey

Tags:   SANJANA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ