మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అక్టోబర్ లో మాస్ జాతర తో అలరించిన రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వెరైటీ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ తో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లోకి వెళితే.. భార్యకు తెలియకుండా భర్త తప్పు చేసి దాన్ని కవర్ చెయ్యడానికి పడే కష్టాలు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఫ్యామిలీ విషయాన్ని దాచేయడం లాంటి కాన్సెప్ట్ తో ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి తెరకెక్కింది. రవితేజ మాస్ యాక్షన్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు టర్న్ అయ్యారు.
ఈ టీజర్ ని చూస్తే గతంలో వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైబ్‌ను గుర్తు చేస్తుంది. రవితేజ లుక్స్ విషయంలో కంప్లైంట్స్ ఉన్నా.. గర్ల్ ఫ్రెండ్ గా ఆషిక రంగనాధన్ గ్లామర్ షో తో షేక్ చేసింది. డింపుల్ హయ్యాతి భర్తను గుడ్డిగా నమ్మే భార్య పాత్రలో ట్రెడిషనల్ గానే అందాలు చూపించేసింది.
భీమ్స్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కిషోర్ తిరుమల డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రవితేజ సందడి షురూ చేస్తున్నారు.




ఆస్కార్ల చరిత్రలో కనీవినీ ఎరుగనిది
Loading..