Advertisementt

BB9: మనసులను తాకిన ఇమ్ము జర్నీ

Thu 18th Dec 2025 09:52 AM
bigg boss  BB9: మనసులను తాకిన ఇమ్ము జర్నీ
Emmanuel journey on Bigg Boss Telugu 9 BB9: మనసులను తాకిన ఇమ్ము జర్నీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం టాప్ 5 లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన ఉన్నారు. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ ఈ ముగ్గరి మధ్యలో ఈ సీజన్ ట్రోఫీ ఉండబోతుంది అది స్పష్టమైనట్లే. అయితే మొదటి వారం నుంచి బయట ఎలాంటి నెగిటివిటి లేకుండా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. హౌస్ లో అందరితో బావుంటూ టాస్క్ ల్లోనూ ఇరగదీస్తున్నాడు. 

అయితే మధ్యలో అతను నామినేషన్స్ లోకి రాకపోవడంతో ఇమ్మాన్యుయేల్ ఓట్ బ్యాంకు తగ్గింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోస్ ప్లే చేస్తున్నారు. అందులో ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ జర్నీ వీడియో అందరిని మనసులను తాకింది. ఇమ్మాన్యుయేల్ కమెడియన్ కాదు హీరో అంటున్నారు. 

అంతగా ఇమ్మన్యుయెల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పోరాటాలు, భరణి కోసం నిలబడి అతను రీ ఎంట్రీకి హెల్ప్ చెయ్యడం, తనూజ తో స్నేహం, సంజన తో బాండింగ్, టాస్క్ ల్లో తుక్కు రేగ్గొట్టడం, స్టాండ్ తీసుకునే చోట తీసుకోవడం అన్ని ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో లో హైలెట్ చెయ్యడమే కాదు ఇమ్మాన్యుయేల్ ని బిగ్ బాస్ హీరోగా చూపించడం ఇమ్ముని కంటతడి పెట్టేలా చేసింది. 

Emmanuel journey on Bigg Boss Telugu 9:

Bigg Boss Telugu 9 Emmanuel AV Journey

Tags:   BIGG BOSS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ