Advertisementt

BB 9: ఇమ్మాన్యుయేల్ కోసం జబర్దస్త్ గ్యాంగ్

Wed 17th Dec 2025 06:23 PM
emmanuel  BB 9: ఇమ్మాన్యుయేల్ కోసం జబర్దస్త్ గ్యాంగ్
BB9: Jabardasti gang support for Emmanuel BB 9: ఇమ్మాన్యుయేల్ కోసం జబర్దస్త్ గ్యాంగ్
Advertisement
Ads by CJ

ఒక కమెడియన్ బిగ్ బాస్ విన్నర్ అయితే అది మాములు సెన్సేషన్ కాదు, హౌస్ లో కామెడీ చేస్తూ నవ్వించడమే కాదు, టాస్క్ ల్లోనూ స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఢీ కొట్టి గెలవడం కూడా మాములు విషయం కాదు. గతంలో చలాకి చంటి, ముక్కు అవినాష్, ఫైమా లాంటి వాళ్ళు జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ లోకి వనా టాస్క్ ల పరంగా ఇమ్మాన్యుయేల్ అంత పవర్ ఫుల్ పెరఫార్మెన్స్ ఇవ్వలేదు. 

కానీ ఈ సీజన్ లో కమెడియన్ గా అడుగుపెట్టిన ఇమ్ము స్ట్రాంగ్ ప్లేయర్స్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్ లను ఢీ కొట్టి మూడుసార్లు కెప్టెన్ గా నిలువడమే కాదు, పది వారాల పాటు అసలు నామినేషన్స్ లోకి రాకుండా రికార్డ్ సృష్టించాడు. అయితే అతను నామినేషన్స్ లోకి రాకపోవడమే మైనస్ అయ్యింది. అతని ఫ్యాన్ బేస్ తగ్గింది.

దానితో టైటిల్ కి కాస్త దూరమయ్యాడు. ఈలోపు తనూజ, కళ్యాణ్ పడాల టైటిల్ రేస్ లోకి రావడం, ఇప్పుడు అందరూ బిగ్ బాస్ టైటిల్ వారి మద్యనే ఉంది అంటున్నారు. అందుకే ఇమ్మాన్యుయేల్ కి సపోర్ట్ గా జబర్దస్త్ బ్యాచ్ గెటప్ శ్రీను లాంటి వాళ్ళు ఇమ్మాన్యుయేల్ కి ఓటెయ్యమని క్యాంపెయినింగ్ మొదలు పెట్టారు. మరి ఇమ్మాన్యుయేల్ కి ఈ జబర్దస్థ్ సపోర్ట్ ఎంతవరకు పని చేస్తుందో చూద్దాం. 

BB9: Jabardasti gang support for Emmanuel:

Bigg Boss 9: Emmanuel

Tags:   EMMANUEL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ