Advertisementt

OG డైరెక్టర్ కి పవన్ కాస్ట్లీ గిఫ్ట్

Tue 16th Dec 2025 03:58 PM
pawan kalyan  OG డైరెక్టర్ కి పవన్ కాస్ట్లీ గిఫ్ట్
Pawan Kalyan Costly Gift To Sujeeth OG డైరెక్టర్ కి పవన్ కాస్ట్లీ గిఫ్ట్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ కి పవన్ కళ్యాణ్ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. సెప్టెంబర్ లో విడుదలైన OG చిత్రం మంచి హిట్ అవడమే కాదు పవన్ గ్యాంగ్ స్టార్ లుక్స్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్ట్రయిట్ మూవీ తో హిట్ కొట్టారు. 

పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజాస్ గంభీర అంటూ సుజిత్ ని మెచ్చుకున్నారు. తాజాగా తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సుజిత్ కి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు కీ ను పవన్ కళ్యాణ్ స్వయంగా సుజిత్‌కు అందించారు. తన అభిమాన హీరో నుంచి ఇలాంటి ఓ గిఫ్ట్ రావడం పట్ల దర్శకుడు సుజీత్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 

ఇదే తనకు బెస్ట్ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ పంచుకుంటూ ఫోటోలను షేర్ చేసాడు. ప్రస్తుతం పవన్ సుజిత్ కి కారు తాళాలు అందిస్తూ కారు ముందు దిగిన ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Pawan Kalyan Costly Gift To Sujeeth:

 Pawan Kalyan Gifted Land Rover To OG Director Sujeeth

Tags:   PAWAN KALYAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ