Advertisementt

ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో

Tue 16th Dec 2025 11:24 AM
tg viswaprasad  ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో
TG Viswaprasad sensational comments about Akira Nandan ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో
Advertisement
Ads by CJ

ఏ స్టార్ హీరో వారసుణ్ణి అయినా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యాలంటే ఆచి తూచి దర్శకులను, ప్రొడక్షన్ హౌస్ ని ఎంచుకుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించడంతో ఆయన వారసుడు అకీరా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చెయ్యాలని పవన్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. రీసెంట్ గా అకీరా తెరంగేట్రం పై సోషల్ మీడియాలో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. 

అకీరా ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఎవరికీ వస్తుంది, ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ.. ఆ అవకాశం కోసమే చాలామంది దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న క్లోజ్ నెస్ ని అలాగే ఆయన తో మరోసారి సినిమా చెయ్యాలనే కోరికను, ముఖ్యంగా ఆయన వారసుడు అకీరా ను ఇండస్ట్రీకి లాంచ్ చెయ్యాలనే డ్రీమ్ ని బయటపెట్టారు. తాజాగా ఆయన ఒక ఈవెంట్ లో పవన్ క‌ళ్యాణ్ గారితో నా ప‌రిచ‌యం, నాకున్న అనుబంధం సినిమాలతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ తో స్నేహం పెరిగాక మా నిర్మాణ సంస్థ‌లో సినిమా చేయ‌డానికి డేట్లు ఇచ్చారు. అలా పవన్ తో బ్రో మూవీ చేశాం.

మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాం, పవన్ కుమారుడు అకీరాను ఇండస్ట్రీకి లాంచ్ చేసే ఛాన్స్ వ‌స్తే కచ్చితంగా చేస్తాం. అకీరా తో సినిమా సెట్ అయితే అది పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ మూవీ గా తీస్తాం. అకీరా హైట్, ప‌ర్స‌నాలిటీని బ‌ట్టి చూస్తే అత‌ను పర్ఫెక్ట్ హీరో మెటీరియ‌ల్. అత‌ణ్ని లాంచ్ చేయాల‌నే ఇంట్రెస్ట్ నాకు ఉంది అంటూ అకీరా తో సినిమా అవకాశం కోసం విశ్వప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేసారు. 

TG Viswaprasad sensational comments about Akira Nandan:

Producer TG Viswaprasad sensational comments about Akira Nandan

Tags:   TG VISWAPRASAD
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ