Advertisementt

బ్ర‌ద‌ర్స్ త్ర‌యంపై గుసగుస‌లు

Tue 16th Dec 2025 09:08 AM
rishab shetty  బ్ర‌ద‌ర్స్ త్ర‌యంపై గుసగుస‌లు
Gossips on Shetty Brothers బ్ర‌ద‌ర్స్ త్ర‌యంపై గుసగుస‌లు
Advertisement
Ads by CJ

క‌న్న‌డ చిత్ర రంగంలో త‌మ‌దైన ముద్ర వేస్తూ ముగ్గురు బ్రదర్స్ నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. కాంతార ఫేం రిష‌బ్ శెట్టి, అత‌డి ఇద్ద‌రు సోద‌రులు ర‌క్షిత్ శెట్టి, రాజ్ బి.శెట్టి.. పూర్తిగా ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మై ప‌ని చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు బ్ర‌దర్స్ మ‌ధ్య విభేధాల గురించి జాతీయ‌ మీడియా క‌థ‌నం వెలువ‌రించడం హాట్ టాపిగ్గా మారింది.

కాంతార్ పార్ట్ 1 స‌మ‌యంలో ఆ ముగ్గురు సోద‌రులు క‌లిసి ఉన్నారు. ఆ స‌మ‌యంలో రిష‌బ్ కి ఇద్ద‌రు సోద‌రుల నుంచి బోలెడంత మ‌ద్ధ‌తు, ప్రోత్సాహం క‌నిపించింది. కానీ కాంతార చాప్ట‌ర్ 1 రిలీజ్ త‌ర్వాత‌ ప‌రిస్థితులు మారిపోయాయ‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ముగ్గురి మ‌ధ్యా మ‌నస్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని, అందుకే ఒక‌రికొక‌రు ప్ర‌శంస‌లు కానీ ప‌ల‌క‌రింపులు కానీ క‌నిపించ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కాంతార చాప్ట‌ర్ 1 గ్రాండ్ స‌క్సెస్ ని రిష‌బ్ ఇద్ద‌రు సోద‌రులు అంత‌గా సెల‌బ్రేట్ చేయ‌లేద‌ని కూడా స‌ద‌రు క‌థ‌నం ఎత్తి చూపింది. ర‌క్షిత్ శెట్టికి రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అవార్డు లభించిన‌ప్పుడు కూడా రిష‌బ్ అంత‌గా దాని గురించి పొగ‌డ‌లేదు. ఇప్పుడు రాజ్ బి శెట్టి న‌టించిన 45 సినిమా గురించి రిష‌బ్ మాట్లాడుతూ, అత‌డు త‌న సోద‌రుడిని మిన‌హా చిత్ర‌బృందం అంద‌రినీ పొగిడేసాడు. ఇందులో న‌టించిన సీనియ‌ర్లు ఉపేంద్ర‌, శివ‌రాజ్ కుమార్ ల‌ను ఆకాశానికెత్తేసినా, చిత్ర క‌థానాయ‌కుడు రాజ్ బి.శెట్టి పేరు కూడా నామ‌మాత్రంగా రిష‌బ్ ప్ర‌స్థావించ‌లేదు! అంటూ స‌ద‌రు క‌థ‌నంలో పేర్కొన్నారు. అయితే ఇవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని బ్ర‌ద‌ర్స్ ఖండిస్తారేమో వేచి చూడాలి. 

Gossips on Shetty Brothers:

  What Happening In Between Rishab Shetty and his Brothers  

Tags:   RISHAB SHETTY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ