మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫ్యామిలిలో లుకలుకల విషయంలో, కూతురు ఎదురు దాడి విషయంలో ఆయన మౌనం వహిస్తున్నారు. మేనల్లుడు హారిష్ రావు విషయంలో కవిత చేసిన కామెంట్స్ కి కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. కూతురు కవిత జైలులో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ లు పట్టించుకోలేదు, తనపై సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడిని తిప్పికొట్టలేదు అనే అక్కసు తో కవిత తనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని హరీష్ రావు ని సంతోష్ రావు ని టార్గెట్ చేసింది.
అయితే మొదట్లో కేసీఆర్ ని చూసి వెనకడుగు వేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కవిత పై ఆరోపణలు చెయ్యడానికి ముందుంటున్నారు. కేసీఆర్ ని గౌరవించిన వారు ఇప్పుడు ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు, దానితో కవితను కామెంట్స్ చేస్తూ ఆమె విషయాలను లీక్ చేస్తామంటూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా కేసీఆర్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న మీడియా ఛానల్ టీ - న్యూస్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు కవిత పై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. కేసీఆర్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న మీడియా ఛానల్ టీ - న్యూస్ ఛానల్ కి లీగల్ నోటీసులు.. పంపించడమే కాదు వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది.




ఇంత అందానికి ఎందుకిన్ని కష్టాలు 
Loading..