సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా నిలదొక్కుకోలేక డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి చేరి సత్తా చాటుతున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. దుబాయ్ వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ తో తాను గత ఐదేళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లుగా చెప్పిన నివేదా పేతురాజ్ త్వరలోనే రజిత్ ఇబ్రాన్ వివాహం చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసింది.
ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్దమవుతున్నామని, ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, 2026 జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామనే వార్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. కానీ తాజాగా నివేదా పేతురాజ్ తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని పెళ్లిని ఆపేసినట్లుగా తెలుస్తుంది.
డైరెక్ట్ గా చెప్పకపోయినా నివేదా పేతురాజ్-రజిత్ ఇబ్రాన్ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాకుండా నివేదా పేతురేజ్, రజిత్ లు ఒకరినొకరు ఇన్స్టా లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దానితో నివేద పేతురేజ్ ప్రేమ, పెళ్లి బ్రేకప్ అయ్యింది అనే వార్త వైరల్ అయ్యి కూర్చుంది.




ఫిలింఇనిస్టిట్యూట్ పెట్టండి చిరు సూచన
Loading..