Advertisementt

ఫాల్కే బ‌యోపిక్ ఆపేశాక‌ హిరాణీ ప్లాన్ ఇదే

Tue 09th Dec 2025 07:55 PM
aamir khan  ఫాల్కే బ‌యోపిక్ ఆపేశాక‌ హిరాణీ ప్లాన్ ఇదే
Aamir Khan and Rajkumar Hirani Put The Dadasaheb biopic ఫాల్కే బ‌యోపిక్ ఆపేశాక‌ హిరాణీ ప్లాన్ ఇదే
Advertisement
Ads by CJ

అమీర్ ఖాన్- ఆర్.మాధ‌వ‌న్- శ‌ర్మాన్ జోషి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన 3 ఇడియ‌ట్స్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోని క్లాసిక్ హిట్స్ లో ఒక‌టి. స్నేహం, క‌ళాశాల జీవితం నేప‌థ్యంలో చ‌క్క‌ని సందేశంతో ఈ సినిమాని హిరాణీ అద్భుతంగా తెర‌కెక్కించారు. ఇది యువ‌త‌రంలో స్ఫూర్తి నింపిన చిత్రం. క‌మ‌ర్షియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 400 కోట్లు వ‌సూలు చేసింది.

అయితే చాలా కాలంగా `త్రి ఇడియ‌ట్స్` సీక్వెల్ గురించి చ‌ర్చ సాగుతూనే ఉంది. రాజ్ కుమార్ హిరాణీ స్క్రిప్టుపై ప‌ని చేస్తున్నా అంత‌కంత‌కు డిలే అవుతూనే ఉంది. అయితే దాదాసాహెబ్ ఫాల్కే స్క్రిప్టు స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డంతో దానిని ప‌క్క‌న పెట్టిన అమీర్- హిరాణీ జోడీ ఇప్పుడు `3 ఇడియ‌ట్స్` సీక్వెల్ స్క్రిప్టుపై దృష్టి సారించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. 

2026 ద్వితీయార్థంలో ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని ఈ జోడీ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. మొద‌టి భాగం ఎక్క‌డ ఆగిందో, అక్క‌డి నుంచి కొన‌సాగింపులా ఉండేట్టు స్క్రిప్టును వంద‌శాతం ప‌ర్ఫెక్ట్ గా రూపొందిస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. కొన‌సాగింపులోను మునుప‌టి న‌టుల‌ను తిరిగి తీసుకు వ‌స్తార‌ని కూడా తెలుస్తోంది. 

Aamir Khan and Rajkumar Hirani Put The Dadasaheb biopic:

 The Dadasaheb biopic

Tags:   AAMIR KHAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ