Advertisementt

విజయ్ సభ కు గన్ తో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి

Tue 09th Dec 2025 11:22 AM
vijay  విజయ్ సభ కు గన్ తో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి
Man carrying gun tries to enter actor Vijay rally in Puducherry విజయ్ సభ కు గన్ తో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతము జననాయగన్ చిత్రాన్ని కంప్లీట్ చేసేసి పూర్తిగా ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన కరూర్ లో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆ ర్యాలీకి విజయ్ ఆలస్యంగా చేరుకోవడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. 

ఈ తీవ్ర విషాద ఘటన అనంతరం విజయ్ చాలారోజుల తర్వాత మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. అయితే గతంలోలా జరగకుండా పోలీసులు విజయ్ పుదుచ్చేరి సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అంటే ఈ సభకు పెద్దవారు, పసిపిల్లలు, గర్భిణులు, రాకుండా నిషేధం విధించారు. 

అలాగే పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే వేదిక పైకి అనుమతించనున్నారు. అయితే ఈ సభకు ఒక వ్యక్తి తుపాకీతో రావడం అందరికి ఆందోళన కలిగించింది. తుపాకీతో విజయ్ నిలబడే వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

మరి మొన్న కరూర్ తొక్కిసలాట ఘటన మరవకముందే మరోసారి విజయ్ సభలో ఇలా గన్ కనిపించడం అందరిని అందోళనకు గురి చేసింది.

Man carrying gun tries to enter actor Vijay rally in Puducherry:

Man Stopped While Entering Actor Vijay Rally With Gun

Tags:   VIJAY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ