బాలీవుడ్ నటి దీపికా పదుకొనె షూటింగ్ పని గంటలపై చేసిన కామెంట్స్ ఇప్పటికి తీవ్ర దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. కొంతమంది దీపికా కు సపోర్ట్ చేస్తే ఎక్కువమంది దీపికా పదుకొనే కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్ గా కీర్తి సురేష్ ఎన్నిగంటలు షూటింగ్ ఉన్నా ఇబ్బంది లేదు అంది.
తాజాగా ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి అన్నగారు వస్తున్నారు ప్రమోషన్స్ లో చాలా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. అందులో భాగంగా హీరోయిన్స్ పని గంటలపై కృతి శెట్టి హాట్ కామెంట్స్ చేసింది. తను ఎనిమిది గంటల పనే చేస్తాను అని చెప్పను, నేను దర్శకులకు, నిర్మాతలకు అనుకూలంగా ఉండే నటిని, 13 గంటలలైనా చేస్తాను, ఆఖరికి 24 గంటలు పని చెయ్యాల్సి వచ్చినా చేస్తాను.
13 గంటలు నేను సెట్‌లో ఉండాలని దర్శకుడు కోరుకుంటే కచ్చితంగా ఉంటాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకేసారి హైదరాబాద్, చెన్నైలలో డబుల్ షిఫ్టులు కూడా చేశాను. కాకపోతే ఎవరైనా తక్కువ గంటలు పనిచేస్తామంటే దాన్ని నేను తప్పుగా చూడను... అది వారి ఇష్టం అంటూ కృతి శెట్టి ఈ పని గంటల వివాదం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




రాజాసాబ్ తొందరపడాల్సిన టైమొచ్చింది
Loading..