Advertisementt

జ‌మైకా చిరుత‌నే దించుతున్నాడా

Mon 08th Dec 2025 07:02 PM
varanasi  జ‌మైకా చిరుత‌నే దించుతున్నాడా
Varanasi movie update జ‌మైకా చిరుత‌నే దించుతున్నాడా
Advertisement
Ads by CJ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `వార‌ణాసి` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆప్రిక‌న్ అడ‌వులో నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో మహేష్ సాహ‌కుడిగా క‌నిపించ నున్నాడు. అత‌డి సాహ‌స‌మంతా?  జంగిల్ లోనే ఉంటుంది. ఇలా యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్  కావ‌డంతోనే గ్లోబ‌ల్ స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ కానుంది. ఈనేప‌థ్యంలో ప్ర‌చారం కూడా వీలైనన్ని దేశాల్లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

అన్నింటిని మించి హాలీవుడ్ కి కనెక్ట్ అయ్యేలా లాస్ ఎంజెల్స్, న్యూయార్క్ లాంటి న‌గ‌రాల్లో ఈవెంట్లు త‌ప్ప‌నిస‌రి. ఈ సినిమా గ్లింప్స్ ను `అవ‌తార్ 3` కి ఎటాచ్ చేస్తారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే హాలీవుడ్ దిగ్గ‌జాల్ని సైతం రాజమౌళి త‌న సినిమా ప్ర‌చారంలో భాగం చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌మైకా చిరుత ఉసెన్  బోల్ట్ ను కూడా ఆహ్వానించే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లొస్తున్నాయి. సినిమాకి-అత‌డికి ఓ సంబంధం కూడా తెర‌పైకి వ‌స్తుంది.

మ‌హేష్ ర‌న్నింగ్ ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో తెలిసిందే. అత‌డి ర‌న్నింగ్ అచ్చంగా ఉసెన్ బోల్ట్ నే త‌ల‌పిస్తుంది. బోల్ట్ ని మ‌హేష్ అనుక‌రిస్తాడ‌నే ప్రచారం కూడా చాలా కాలంగా ఉంది. జంగిల్ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో సినిమాలో చాలా ఛేంజింగ్ స‌న్నివేశాలుంటాయి. వాటిలో మ‌హేష్  ర‌న్నింగ్ త‌ప్ప‌నిస‌రిగా హైలైట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో బోల్ట్ ని సైతం ప్ర‌చారంలో భాగం చేస్తే ఆన్న ఆలోచ‌న రాజ‌మౌళిలో మొద‌లిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి లీకైంది.

నిజంగా బోల్ట్ ని క‌నుక ర‌ప్పించ గ‌లిగితే సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ ప‌రంగానూ వ‌ర్కౌట్ అవుతుంది. జ‌మైక‌న్ స్ప్రింట‌ర్ కి ప్ర‌పంచ  వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అత‌డిని స్పూర్తిగా తీసుకుని  స్ప్రింట‌ర్లు అయిన వాళ్లు ఎంతో మంది. భార‌త్ లోనూ అత‌డి ప్ర‌భావం ఎంతో ఉంది.

Varanasi movie update:

Mahesh Babu-Rajamouli Varanasi movie update

Tags:   VARANASI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ