బాలీవుడ్ లో డిసెంబర్ 5 న రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలై అంచనాలకు మించి హిట్ టాక్ తెచ్చుకుంది. ధురంధర్ విడుదలకు ముందు ఆ సినిమా నిడివి అందరిని భయపెట్టింది. మూడున్నర గంటల ధురంధర్ ని ప్రేక్షకులు ఎలా భరిస్తారో అనే చర్చ మాములుగా నడవలేదు. కానీ ఆదిత్య ధార్ మాత్రం ప్రేక్షకులను బోర్ కొట్టకుండా కుర్చీలకు అతుక్కునేలా చేసారు.
ధురంధర్ భారమైనా ఆడియన్స్ ఓపిగ్గా భరిస్తున్నారు.. కారణం కంటెంట్ అద్భుతంగా ఉండడమే. రణవీర్ మాత్రమే కాదు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ అందరూ ఒకరికొకరు పోటీపడి పెర్ఫామ్ చేసారు. బాక్సాఫీసు దగ్గర స్లో గా మొదలై రెండు రోజుల్లో 60 కోట్లు మూడు రోజులు తిరిగేసరికి ధురంధర్ ఏకంగా 100 కోట్ల క్లబ్బులో కాలు పెట్టింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.
పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్రలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సరసన సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది.




అఖండ 2: అభిమానులు vs ప్రొడ్యూసర్స్ 
Loading..