దెయ్యంతో మనిషి సహజీవనం చేయడం, దెయ్యంతో మాట్లాడటం, కలిసి ప్రయాణించడం ఇవన్నీ సినిమాలలోనే చూస్తాం. ఇలాంటి విషయాలు బయట ఎవరికైనా చెబితే వింటారా? ఆ వ్యక్తిని చూసి నవ్వుకుంటారు. ఇతడికి పిచ్చి పట్టిందని లైట్ తీస్కుంటారు. కానీ ఇప్పుడు అందాల కథానాయిక కృతి శెట్టి తాను నేరుగా ఆత్మను చూసానని, ఆత్మతో మాట్లాడినట్టు అనిపించిందని చెబుతోంది. ఆత్మ ముఖాన్ని చూడలేదు కానీ, శరీరాన్ని చూసానని తెలిపింది. తాను ఉన్న హోటల్ గదిలో పెద్ద శబ్ధం రాగానే తాను, తన తల్లి అక్కడ ఒక శరీరం కదలడాన్ని చూసామని, ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నామని కూడా చెప్పింది కృతి.
అయితే ఈ బ్యూటీ నిజంగానే ఆత్మను చూసిందా? అంటే.... ప్రస్తుతం నటిస్తున్న ఆత్మల నేపథ్య సినిమా `వా వాతియార్` ప్రభావమే ఇదంతా అని నెటిజనులు అంటున్నారు. ఈ చిత్రంలో కృతి స్పిరిట్ రీడర్ గా కనిపించనుంది. అంటే దెయ్యాలు, ఆత్మలతో మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తుంది. ఇందులో కార్తీ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. నలన్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్లోకి వెళ్లే ముందు రోజు తనకు హోటల్ గదిలో ఆత్మ కనిపించిందని కృతి చెబుతోంది. అయితే తాను ఆత్మను చూడకపోయినా తన పాత్రలోకి లీనమవ్వడం వల్ల తాను దెయ్యంతో మాట్లాడుతున్నట్టు భ్రమిస్తోందని అంతా అంటున్నారు. అయితే అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన పాత్ర చాలా కీలకమైనదని కూడా కృతి వెల్లడించింది.
షూటింగుకు వెళ్లడానికి ఒక రోజు ముందు తాము బస చేసిన హోటల్ గదిలో ఆత్మను చూడగానే తాను తన తల్లి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నామని కూడా తెలిపింది. మేము తుళు వంశీకులం. మా పూర్వీకులు మమ్మల్ని నిరంతరం గస్తీ కాస్తూ రక్షిస్తారని మేం నమ్ముతాం. వారంతా దేవదూతల్లా మమ్మల్ని కాపాడుతారు.. అందువల్ల కచ్ఛితంగా నేను ఆత్మలను నమ్ముతాను అని చెప్పింది కృతి.




రీతూ చౌదరి ని రోస్ట్ చేసిన హోస్ట్ శివాజీ
Loading..